అన్వేషించండి

Karimnagar Mayor Election: కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకున్న బీజేపీ.. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్

చివరివరకూ ఉత్కంఠరేపిన కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించి కార్పొరేషన్ దక్కించుకుంది.

Karimnagar Mayor Election | కరీంనగర్ మున్సిపల్ పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామాల మధ్య భారతీయ జనతా పార్టీ (BJP) మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మేయర్ ఎన్నికల ప్రక్రియలో హైడ్రామా చోటుచేసుకోగా, చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. కూటమి నుండి బీఆర్ఎస్ బయటకు రావడం, మెజారిటీ ఓటింగ్ ప్రక్రియలో బీజేపీ తన పట్టును నిరూపించుకోవడంతో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారు. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరమయ్యేలా చేసి బీజేపీకి విజయాన్ని అందించారు.

కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్..

కరీంనగర్‌ కార్పొరేషన్‌కు మేయర్‌ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా సునీల్‌రావు పేర్లను బీజేపీ ప్రకటించింది. దాంతో వీరే మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. ఎన్నికకు హాజరైన సభ్యులలో నిర్ణీత 51 శాతం ఓట్లను సాధించి బీజేపీ అభ్యర్థి మేయర్‌గా విజయం సాధించారు. ఈ గెలుపుతో బీజేపీ కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్త రాజకీయ శకానికి తెరలేపింది. మరోవైపు నిజామాబాద్ మేయర్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ (34 సీట్లు) రాలేదు. కానీ, అత్యధిక స్థానాలు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీ తమ సంఖ్యాబలంతో మేయర్ ఎన్నకల్లో విజయం సాధించింది.


పార్టీల వారీగా సీట్ల వివరాలు:
బీజేపీ (BJP) 30
కాంగ్రెస్ (INC)14
బీఆర్ఎస్ (BRS)09
స్వతంత్రులు (Independents) 08
ఎంఐఎం (AIMIM) 03
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)02
మొత్తం స్థానాలు 66

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget