News
News
X

Safai Mitra: సఫాయి మిత్ర పోటీల్లో కరీంనగర్ ముందంజ, మొదటి స్థానాన్ని దక్కించుకుంటుందా?

Safai Mitra: గతేడాది సఫాయి మిత్ర సురక్ష పోటీల్లో రెండో స్థానం దక్కించుకొని, 4 కోట్ల రూపాయలు నగదు పురస్కారాన్ని అందుకున్న కరీంనగర్.. ఈ ఏడాది మొదటి ర్యాంకు సాధించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. 

FOLLOW US: 

Safai Mitra: కరీంనగర్ నగర పాలక సంస్థ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య పనుల విషయంలో జరుగుతున్న సఫాయి మిత్ర సురక్ష పోటీలో గత ఏడాది దేశంలోనే రెండో ర్యాంకు సంపాదించింది. అలాగే నాలుగు కోట్ల నగదు పురస్కారాన్ని కూడా దక్కించుకుంది. అయితే గతంలో కంటే మరింత మెరుగ్గా పని చేసి ఈసారి ఏకంగా ఫస్ట్ ర్యాంక్  సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే కరీంనగర్ నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు.. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సిద్ధం చేశారు. దేశ వ్యాప్తంగా పలు నగరాలు కూడా ప్రస్తుతం ఇదే అంశంలో కరీంనగర్ తో పోటీ పడుతున్నాయి. 

అప్పుడే కోటి రూపాయల నగదు పురస్కారం..

జాతీయ స్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ముందుగా ఎంపిక చేస్తుంది. అందులో పూర్తి స్థాయిలో మానవ రహిత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్టణాలను ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగానే "సఫాయి మిత్ర సురక్షిత షెహర్" పేరుతో మిస్టర్ సిద్ధం చేసి ఆయా పట్టణాలు 100% వాహనాల వినియోగంతో పరిశుభ్రతా కార్యక్రమాలు చేస్తున్నాయో లేదో పరిశీలిస్తుంది. అప్పుడే కోటి రూపాయల నగదు పురస్కారం దక్కించుకునే వీలు ఉంటుంది. ముఖ్యంగా మనుషులు, పారిశుద్ధ కార్మికులతో కాకుండా యంత్రాల వినియోగం ద్వారా భూగర్భ మురుగునీటిని శుభ్రం చేయించే విషయంలోనే ఆయా నగరాలు మార్కులు సంపాదిస్తాయి. ఒకవేళ కచ్చితంగా చేయాల్సి వచ్చినప్పుడు ఆయా కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ కిట్లు ధరిస్తారో లేదో పరిశీలిస్తుంది.

పూర్తి స్థాయిలో యంత్రాలు వాడుతూ..

నగరంలోని 3500 ఏళ్ల నుండి నీరు వస్తుండగా వీటిని సరిదిద్దే క్రమంలో ఎస్.డబ్ల్యూ.జి డ్రైనేజీలను నిర్మించారు. ఎక్కడైనా ఇది పాడై సమస్యలు వస్తే వాటిని పరిశుభ్రం చేయడానికి పూర్తి స్థాయిలో మిషినరీలు మాత్రమే ఉపయోగిస్తున్నారు. జస్టిన్ మెషిన్ ద్వారా పైపుని డ్రైనేజీ లోపలికి పంపించి చెత్తను పూర్తిస్థాయిలో క్లీన్ చేస్తున్నారు. మరోవైపు పట్టణంలో 80 వేల ఇళ్లు ఉండగా వాటన్నిటికీ కూడా సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి. మరోవైపు పారిశుద్ధ పనులు ఎప్పటికప్పుడు వేగవంతం చేయడానికి పూర్తి స్థాయిలో యంత్రాలను వాడుతున్నారు. గతంలో లాగా ట్రాక్టర్లు, ఆటోలు, రిక్షాలు కాకుండా బ్యాక్ హోల్ లోడర్ , జెట్టింగ్ మెషిన్ లాంటి అత్యాధునిక పరికరాలను వాడి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే పనిలో పడ్డారు. 

ఆన్ లైన్ ద్వారా సమావేశం..

సఫాయి మిత్ర సురక్షిత ప్రకటనలో భాగంగా జాతీయ స్థాయిలో మేయర్లు, కమిషనర్లతో స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రెటరీ రూపా మిశ్రా ఆన్ లైన్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శానిటేషన్ విషయంలో మెషినరీ వాడకంపై పూర్తి స్థాయిలో చర్చ జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇందులో ఎంపికైన నగరాలకు నగదు పురస్కారం ద్వారా సత్కరించనున్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణం సురక్షిత నగరంగా ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్ తో పాటు కోరుట్ల, జగిత్యాల, రామగుండం, సిరిసిల్ల, మున్సిపాలిటీలు ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ తో పోటీ పడుతున్నాయి. మొత్తానికి గతంలో లాగా కాకుండా దుర్గంధాన్ని వెదజల్లే పనులకు మనుషులను దూరంగా ఉంచుతూ యంత్రాల ద్వారా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ప్రజల్లో సైతం అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

Published at : 18 Aug 2022 11:36 AM (IST) Tags: karimnagar latest news Safai Mitra Safai Mitra Suraksha Competitions Karimnagar Preparing to Safai Mitra Safai Mitra Suraksha Shehar

సంబంధిత కథనాలు

Crime News: బతుకమ్మ ఆడుతున్న భార్యను చంపిన భర్త, అదే కారణమా? 

Crime News: బతుకమ్మ ఆడుతున్న భార్యను చంపిన భర్త, అదే కారణమా? 

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన పెట్రోల్ ట్యాంకర్

Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన పెట్రోల్ ట్యాంకర్

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం