అన్వేషించండి

గోదావరిలోకి వరద ప్రవాహం- కళకళలాడుతున్న ప్రాజెక్టులు

ఇప్పటికే పడి వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరిసరాల్లో పడుతున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఐదు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు జనజీవనం ఇబ్బంది పడుతోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

తెలంగాణలో వాతావరణంపై రాత్రి 1 గంటకు ఐఎండీ ప్రత్యేక బులెటిన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లా, కామారెడ్డి, కుమ్రంభీమ్‌ మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భవనగిరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఇప్పటికే పడి వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరిసరాల్లో పడుతున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.  ప్రవాహం 48 అడుగులు దాటితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 

వివిధ ప్రాజెక్టల వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...
గోదావరి బేసిన్‌లో ఉన్న సింగూరులో పూర్తి స్థాయి నీటి మట్టం 1717.93 అడుగులు ఉంటే ప్రస్తుతం 1709.53అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 29.91 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 19.25 టీఎంసీల నీరు ఉంది. సింగూరుకు 8,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే... 385 క్యూసెక్కులను నీటిని బయటకు వదులుతున్నారు. 

నిజాం సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు ప్రస్తుతం నీటి మట్టం 1388.03 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.8 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 4.39 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 23,400 క్యూసెక్కులు ఉంటే బయటకు ఇంకా నీటిని విడుదల చేయడం లేదు. 
శ్రీరాం సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం -1091 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 1070.90 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు - ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 38.95 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 59,165 ఉంది. ప్రస్తుతానికి నీటిని బయటకు వదలడం లేదు. 

మిడ్‌మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -1043.31 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -1025.69 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -27.50 టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.72 టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 4590 క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 1700 క్యూసెక్కులు

లోయర్ మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -920 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -896.35 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -24.07టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --8.55 టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 1522 క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో-226క్యూసెక్కులు

కడెం పూర్తిస్థాయి నీటి మట్టం -700అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -694.700 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -7.6 టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --5.66టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 16,1800క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 104334క్యూసెక్కులు 

9 గేట్లు ఎత్తి నీటి విడుదల

 

ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి మట్టం -485.56 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -478.94అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -20.18టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.96టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 10,226క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 7559క్యూసెక్కులు

అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం సమ్మక్క బ్యారేజీ 8.76 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మేడిగడ్డబ్యారేజీకి 5.65 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌ బ్యారేజీకి 9.57లక్షల క్యూసెక్కులుు, సుందిళ్ల బ్యారేజీకి 1296 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆయా ప్రాజెక్టుల్లో గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget