కరీంనగర్ జిల్లాలో జోరుగా వెహికల్ సేల్స్- గతంతో పోలిస్తే 75 శాతం పెరిగిన వాహనాలు!
ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించని మారుమూల గ్రామాలకు సైతం ఆటోలు వెళ్తున్నాయి. పట్టణాల్లోనూ ప్రయాణికుల రాకపోకలకు అనువైన రవాణా సాధన ఆటోని ఎంతో మంది యువకులు ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2014 నుంచి 8 సంవత్సరాలలో 4,70,849 వెహికల్స్ పెరిగాయి. గతంతో పోలిస్తే 75% పెరిగినట్లు వీటిలో 4 వీలర్స్, టూ, వీలర్స్, వ్యవసాయ, వ్యవసాయేతర ట్రాక్టర్స్, హార్వెస్టర్లు,ఆటో రిక్షాలు, ట్రాలీలు,క్యాబ్స్ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఒకటి కన్నా ఎక్కువ టూ వీలర్స్ కామన్ అయ్యాయి. మహిళలు జాబ్ వంటి అవసరాల రీత్యా వాహనాలు వినియోగించడం పెరగడంతో వీటి అమ్మకాలు ఎక్కువయ్యాయి.
కార్ల సంఖ్య కూడా కరీంనగర్‌లో విపరీతంగా పెరిగింది. 2014తో పోలిస్తే రెండు రెట్లు అయింది. సొంతంగా కారు కలిగి ఉండటం, అవసరంగా భావించడం, కరోనా తర్వాత సొంత వాహనాల్లోనే ప్రయాణానికి ఆసక్తి చూపడం అందుకు ముఖ్య కారణాలు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు కూలీల కొరత వల్ల ట్రాక్టర్లు, హార్వెస్టర్ యంత్రాల వినియోగం పెరిగింది.
ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించని మారుమూల గ్రామాలకు సైతం ఆటోలు వెళ్తున్నాయి. పట్టణాల్లోనూ ప్రయాణికుల రాకపోకలకు అనువైన రవాణా సాధన ఆటోని ఎంతో మంది యువకులు ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు విద్యుత్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం కూడా ఈ వాహనాల కొనుగోలుకు ప్రోత్సహించడానికి రాయితీలు ప్రకటించింది. క్రమంగా ఈ వాహనాల సంఖ్య కూడా ఉమ్మడి జిల్లాలో పెరుగుతోంది.
ఉమ్మడి జిల్లాలో వెహికల్ సేల్స్ 8 సంవత్సరాల క్రితంతో పోలిస్తే భారీగా పెరిగాయి. పెరుగుతున్న అవసరాలు మారిన సామాజిక పరిస్థితులను బట్టి జనం వెహికల్ సేల్స్ పై దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. ఇక పేరెంట్స్ సైతం కాస్త ఎదిగిన పిల్లలకు సొంత వాహనం కొనివ్వడమే ఉత్తమం అనే అభిప్రాయానికి రావడం కూడా మరో కారణం. గృహిణులు కూడా ఇంటి అవసరాలకు సొంతంగా ఓ టూ వీలర్ ని సమకూర్చుకొని రయ్యిమంటూ రోడ్లపై దూసుకెళ్తున్నారు. వాహనాలు నడపడానికి శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ సెంటర్ల నంబర్లో కూడా భారీగా పెరుగుదల ఉంది. దీంతో దాదాపు గ్రామాల వరకు కూడా టూవీలర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.
ఎనిమిదేళ్ళలో పెరిగిన సేల్స్ ఇవీ....
2014 నుంచి 2022 సంవత్సరంతో పోలిస్తే వెహికిల్ సేల్స్ ఇలా ఉన్నాయి. 2014 లో 43,028 కార్లు కొంటే 2022 వరకు 83,185 కార్లు కొనుగోలు చేశారు.19,386 టూ వీలర్స్ కొంటే 2022 లో 7,63,853 తోడూ వీలర్స్ సేల్ అయ్యాయి. 27,146 ట్రాక్టర్లు వ్యవసాయం కోసం కొంటే 2022 లో 61,682 ట్రాక్టర్లు సేల్ చేశారు. 15380 ట్రాక్టర్లు వాణిజ్యం కోసం కొంటే, 2022 లో 32,474 ట్రాక్టర్లు సేల్ చేశారు. 20,499 ఆటోలు సేల్ చేయగా, 2022 లో 33,263 ఆటోలు సేల్ అయ్యాయి. 1,895 వరకు వరికోత మెషిన్ లను సేల్ చేయగా, 2022లో 4,144 మెషిన్ లు సేల్ అయ్యాయి. 17,214 గూడ్స్ ని సేల్ చేయగా, 2022 లో 32,845 సేల్ అయ్యాయి. 4,731 క్యాబ్స్ కి సేల్ చేయగా 8,789 క్యాబ్స్ సేల్ అయ్యాయి.