Karimnagar Tension: కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!
Karimnagar Tension: తెలంగాణలో మండుతున్న సూరీడు కంటే రాజకీయ నేతల మాటలు ఎక్కువ సెగలు పుట్టిస్తున్నాయి. కేటీఆర్‌పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతుంటే, పాడి కౌశిక్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేసింది.

Karimnagar Tension: తెలంగాణలో నేతల మాటలు శృతి మించుతున్నాయి. ఈ మాటల మంటలు కారణంగానే కరీంనగర్‌లో ఉద్రికత పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల తూటాలు, సవాళ్ల పర్వం సాగుతోంది. ఇది కాస్త దాడుల వరకు వెళ్లింది. బీఆర్‌ఎస్ నేతల మాటలకు ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు దాడులకు దెగబడ్డారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేశారు. ప్రెస్ మీట్ జరుగుతుండగానే బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు.
రేవంత్, కేటీఆర్ కుమ్మక్కు అయ్యారని అందుకే కాళేశ్వరం సహా ఏ కేసులు కూడా ముందుకు కదలడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ కౌంటర్ ఇస్తూ ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో తమకు తెలుసని అన్నారు. చాలా విషయాలు తమ వద్ద ఉన్నాయని సమయం వచ్చినప్పుడు అన్నింటినీ బయటపెడతామన్నారు. ఎవరికి ఎవరు సహాయ మంత్రిగా ఉన్నారో తేలుస్తామని అన్నారు. కచ్చితంగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు.
దీనిపై బండి సంజయ్ ప్రెస్‌మీట్ పెట్టి కేటీఆర్‌పై తీవ్ర పదజాలంతో దూషించారు. మనిషి పుట్టక అంటూ అసభ్యంగా మాట్లాడారు. కరీంనగర్‌లో పూర్తిగా కేటీఆర్‌ను తిరగనివ్వబోమని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారని దునుమాడారు.
దీనికి బీఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది. డ్రగ్స్ వాడే అలవాటు బండి సంజయ్‌కు ఉందని అన్నారు. ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. తంబాకు, డ్రగ్స్ తినే అలవాటులో బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ దాడిని తట్టుకోలేకపోయిన బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలోనే మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడికి తెగబడ్డారు. లోపల ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలోనే విధ్వంసం సృష్టించారు.
దాడులపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బీజేపీ, కాంగ్రెస్ కలిపి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేపైనే ఈ స్థాయిలో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తనను చంపేందుకు ఇప్పటికే రెక్కీ నిర్వహించారని ఇదే విషయాన్ని ఉదయం పెట్టిన ప్రెస్ మీట్‌లో చెప్పానని అన్నారు. అదే ఇప్పుడు కనిపించిందన్నారు. తనను చంపేందుకు కత్తులు, బాంబులు, రాడ్లతో వచ్చారని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారి తప్పిందని చెప్పడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే ఉదాహరణ అని అన్నారు.
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకుల దాడి
— Ramesh Kankanala (@RameshKank45630) May 7, 2026
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో దాడికి వచ్చిన బీజేపీ శ్రేణులు
కారు అద్దాలు, క్యాంపు ఆఫీస్ అద్దాలు పగలగొట్టి విధ్వంసం చేస్తున్న బీజేపీ అల్లరి మూకలు#Karimnagar pic.twitter.com/Uzy5ZNTUdC
దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలన్నారు. వారిని వెంటనే రిమాండ్‌కు తరలించాలని అన్నారు. తాను ఎవరినీ రెచ్చగొట్టలేదని అన్నారు. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము రియాక్ట్ అయ్యామని అన్నారు.
Live : MLA @KaushikReddyBRS Press meet in Karimnagar https://t.co/89089e8v3E
— BRS Party (@BRSparty) May 7, 2026
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు





















