By: ABP Desam | Updated at : 14 Jan 2023 07:01 AM (IST)
బహుజన రాజ్యాధికార యాత్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) నియోజకవర్గంలో బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర జనవరి 2వ తేది నుంచి జనవరి 12వ తేదీ వరకు కొనసాగింది. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొనేరు కోనప్ప ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. 12 రోజుల పాటు సిర్పూర్ (టి) నియోజకవర్గంలో కొనసాగిన బహుజన రాజ్యాధికార యాత్ర విజయవంతంగా పూర్తయిందని, ఈ నెల 16న కాగజ్‌నగర్‌లో భారీ బహిరంగ సభను ఎర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టారు. జనవరి 2న ఈ బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించి నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, సిర్పూర్ (టి), కౌటాల, దెహేగాం, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పించారు. కాగజ్‌నగర్ లోని ఓ వీధిలో కట్టెల మోపు తీసుకొస్తున్న ఓ మహిళ నుంచి తీసుకొని ఆయన కట్టేల మోపును మోసారు. ఆపై ఓ హోటల్లో చాయ్ చేస్తు సందడి చేశారు.
పెద్దవాగులో కూలీన అందవెల్లి బ్రిడ్జిని సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాత్రలో ప్రాణహిత చెవేళ్ళ ప్రాజెక్ట్ సమీపంలో పడవలో ప్రయాణించి ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ని మార్చడంతో 20,000 కోట్ల నష్టం, 2 లక్షల ఎకరాలు సాగుకు నోచుకోకుండా పోయాయన్నారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కు అంబేద్కర్ పేరు పెట్టడంతోనే ఆపేసారన్నారు. నియోజకవర్గంలో ఉన్న గురుకులాల్లో విద్యార్థులకు సరైన మెను అందించడం లేదని, కొన్ని గ్రామాల్లో పాఠశాల భవనాలు సరిగ్గా లేవని దుయ్యబట్టారు.
యాత్రలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలలో పర్యటిస్తు ప్రజల సమస్యలను తెలుసుకుంటు గ్రామ గ్రామాల్లో పర్యటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చివరి రోజున బెజ్జూర్ మండలంలోని ఓ క్షవరం దుకాణంలో ఓ యువకుడికి క్షవరం చేశారు. వాడవాడలో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు. బిసిలకు 27శాతం ఉన్న రిజర్వేషన్ ను 50% అందించాలని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. వచ్చే ఎన్నికలలో కోనప్పను ఓడించాలన్నారు.
రెండో విడత చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 12 రోజులపాటు విజయవంతంగా కొనసాగింది. కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బహుజన రాజ్యాధికార యాత్ర ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సిర్పూర్ (టి) నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని, అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రవీణ్‌కుమార్. ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. యాత్రలో భాగంగా పేపర్ మిల్లు కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. మిల్లు మేనేజ్మెంట్ స్థానిక కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, స్థానికేతరులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బిఎస్పి సైనికులకు హాని జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని స్పష్టం చేశారు. బిఎస్పి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, గిరిజనులు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు అందిస్తామన్నారు.
బెజ్జూర్ మండలం కుకుడ, పోతేపల్లి, సలుగుపల్లి, కోర్తగూడ గ్రామాల్లో పర్యటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... బెజ్జూర్ లో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి అధికార నాయకులు మోసం చేశారన్నారు. వచ్చే ఎన్నికలలో కోనేరు కొనప్ప ను ఓడించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.
బీజేపీ కార్నర్ మీటింగ్స్- రేవంత్ పాదయాత్ర- నేటి తెలంగాణ అప్డేట్స్ ఇవే
Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్
TSRTC Bus Accident : ఛాతీలో నొప్పి బస్సులోంచి దూకేసిన డ్రైవర్, ఆర్టీసీ బస్సు బోల్తా
Funds for Irrigation: స్వర్ణయుగంగా సాగురంగం, నీటిపారుదలకు రూ.26,885 కోట్లు: హరీశ్ రావు
Telangana Budget 2023 Live Updates: 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2023-24
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్