By: ABP Desam | Updated at : 09 Feb 2022 07:11 PM (IST)
వేములవాడ రాజన్న ఆలయం
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది. రాజరాజేశ్వర స్వామికి కానుకలు సమర్పించడం సహజమే అయినప్పటికీ ఓ కుటుంబం ఏకంగా రెండు లక్షల రూపాయల మూట వేసింది. కుమార్తె వీసా కోసం మొక్కుకున్న మొక్కుగా తెలుస్తోంది.
కూతురు వీసా పొందడానికి రాజన్న సహకారం కోరుతూ రెండున్నర లక్షల డబ్బుని ప్యాక్ చేసి అందులో లెటర్ రాసి మరీ హుండీలో వేసి వెళ్లారో అజ్ఞాత భక్తుడు. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా వైరల్ అవుతోంది. తమకు ఏదైనా మంచి జరిగితే దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. కానీ తమ కూతురికి వీసా రావాలంటూ ముందే దాదాపు రెండున్నర లక్షలు సమర్పించిన ఆ కుటుంబ సభ్యులు ఎవరనే చర్చ నడుస్తోంది.
వీసా రావాలనే ఇంత వేశారంటే రేపు వీసా వస్తే ఇంకా ఎలాంటి కానుక ఇస్తారో అని చర్చించుకుంటున్నారు. డింపుల్ కి వీసా రావాలంటూ రాసిన లెటర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే అది ఏ దేశానికి చెందిన వీసా, ఆ భక్తులు ఎవరో వంటి వివరాలు మాత్రం తెలియడం లేదు.
రాజన్న హుండీ ఆదాయం రికార్డులు బద్దలు...
12 రోజుల్లో రాజన్న హుండీలో భక్తులు 2 కోట్ల 25 లక్షల 04 వేల 855 రూపాయల నగదు, 247 గ్రాముల 860 మిల్లీ గ్రాముల బంగారం, 12 కిలోల 940 గ్రాముల వెండి వేశారు. గత నెల 27 వ తేదీ నుంచి ఇప్పటి వరకు లెక్కించిన ఆదాయం గతంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో కంటే ఎక్కువగా ఉంది. గతంలో కోటిన్నర రూపాయల ఆదాయం సమకూరగా, ఈసారి లెక్కింపులో ఏకంగా రూ.2 కోట్ల 25 లక్షలకుపైగా నగదుతో బాటు బంగారం, వెండి కానుకలుగా లభించడం విశేషం.
రాజన్నను దర్శించుకున్న తరువాతే పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు మేడారం వైపు వెళ్తారు. దీంతో వారు తమ కానుకలను బోనాలతోపాటు సమర్పించుకొని మేడారం వైపుగా సాగుతున్నారు. సాధారణ రోజుల్లో కంటే అత్యధికంగా దాదాపు 50 వేల మంది భక్తులు ప్రతిరోజు రాజన్నను దర్శించుకుంటున్నారు. క్యూ లైన్‌లో దాదాపు ఆరు గంటలపాటు వేచి చూస్తున్నారు అంటే ఇప్పుడున్న రద్దీ అర్థం చేసుకోవచ్చు. సమ్మక్క సారక్క జాతర ముగిసే వరకూ ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
Karimnagar Cat Rescue : అర్థరాత్రి "పిల్లి" ప్రాణం కాపాడిన కరీంనగర్ పోలీసులు - ఈ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్
Karimnagar News : కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి!
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టీఎస్ టెట్ 2022 ఫలితాలు లేనట్లే !
Weather Updates: ఏపీలో ఆ జిల్లాల్లో 4 రోజులు వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Inter Results 2022: ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు విడుదల , ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ