అన్వేషించండి

BN Rao Foundation : వైద్యుడే కానీ పేదల పాలిట దేవుడు - కరీంనగర్ వైద్యుడికి జాతీయ స్థాయి గుర్తింపు

Karimnagar News : కరీంనగర్ వైద్యుడు పేదలకు సేవలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మానవసేవే మాధవ సేవ అంటున్నారు.

Dr BN Rao is a health provider for the poor :  వైద్యోనారాయణుడు అంటారు పెద్దలు . అంటే వైద్యం అందించే వైదుడు కూడా ఆ దేవుడితో సమానం అని అర్ధం. అలాంటి వైద్యుడే కరీంగనర్ జిల్లాకు చెందిన డాక్టర్ బీఎన్ రావు.  కేవలం వైద్య చికిత్స చేయడమే కాదు మానవ సేవే మాధవ సేవ అంటూ బిన్ రావు ఫౌండేషన్ పేరుతో నిరుపేదలకు, కేన్సర్ రోగులకు మెడికల్ స్టూడెంట్స్ కు  తన వంతు సాయం చేస్తూ  అండగా ఉంటున్నారు. పేదల పాలిట పెన్నిధి గా నిలుస్తూ నలుగురికి స్పార్తిదాయకంగా నిలుస్తున్న డాక్టర్ బీఎన్ రావు అనేక అవార్డులు తెచ్చుకున్నారు. 

35 ఏళ్లుగా వైద్య వృత్తిలో బీఎన్ రావు ! 

కరీంనగర్ జిల్లా పెగడాపల్లి మండలానికి చెందిన డాక్టర్ బిఎన్ రావు {రేమాటాలజిస్ట్ }1981 లో డాక్టర్ వృత్తి ని ప్రారంభించారు .35 సంవత్సరాల తన సుదీర్ఘ కలం లో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు .తన వద్దకు వచ్చే వారంతా కూడా నిరుపేద కుటుంబాలు, రైతులు నుంచే వస్తుంటారు .తన వద్దకు వచ్చేవారికి ఎక్కువ శాతం మోకాళ్ళ సమస్యలతోనే వస్తుంటారు .మరి కొంత మందికి మందులతో నయం ఐనప్పటికీ కొంతమందికి మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిందే .కానీ ఈ మోకాలు మార్పిడి కి అయ్యే ఖర్చు సుమారుగా రెండు లక్షల వరకు అవుతుంది .మరి అంతటి ఖర్చు పెట్టి మోకాలు మార్పిడి చేయించుకోవడం అందరి తో అయ్యే పని కాదు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఐనా వారికైతే అసాధ్యం అనే చెప్పుకోవచ్చు.   అలాంటివారికోసమే బి ఎన్ రావు ఫౌండేషన్ ద్వారా పేదలకు తవంతు సాయంగా ఉచితంగా మోకాలు మార్పిడి  చేస్తున్నారు డాక్టర్ బిన్ రావు .
 
బెస్ట్‌ కమ్యూనిటీ సర్వీస్‌ కింద జాతీయ అవార్డు

డాక్టర్‌ బీఎన్‌రావు తన పేరిట స్థాపించిన బీఎన్‌ రావు హెల్త్‌ ఫౌండేషన్‌ ద్వారా కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30వేల మంది విద్యార్థులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి 7వేల మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి ఐరన్‌ మాత్రలతో పాటు బెల్లం పట్టీలు, పండ్లు మూడు నెలల పాటు ఉచితంగా పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రెండు విడుతలుగా చేపట్టారు. వీటితో పాటు కరోనా సమయంలో మున్సిపల్‌, పారా మెడికల్‌, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్‌, శానిటైజర్లు, మాస్క్‌లు, ప్రభుత్వ దవాఖానకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఉచితంగా అందజేసినందుకుగాను బీఎన్‌ రావుకు వ్యక్తిగతంగా బెస్ట్‌ కమ్యూనిటీ సర్వీస్‌ కింద జాతీయ అవార్డు దక్కింది.

2017లో బీఎన్ రావు ఫౌండేషన్ స్థాపన
 
2017  లో బిఎన్ రావు ఫౌండేషన్ స్థాపించారు.  ఇప్పటి వరకు 28 మంది కి మోకాలు మార్పిడి చేయించామని బీఎన్ రావు అంటున్నారు .ఎంతో అరుదైన ఈ వైద్య చికిత్స చేయించుకోవాలంటే అందరితో సాధ్యం కాదు కాబట్టే  తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు . తన వద్దకు రైతులు , మారుమూల ప్రాంతాలనుంచి ఎక్కువ శాతం నిరుపేదలే వస్తుంటారని ఆపరేషన్ చేయించుకునే స్థోమత కూడా ఉండదని అన్నారు . అందుకే తన వంతు సహాయంగా ఇలా చేస్తున్నానని అన్నారు .అంతే కాకుండా కరోనా సమయం లో కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామానికి చెందిన వెంకటేష్ కరోనా తో మరణించారు అతని 10 సంవత్సరాల కుమారుడు  ప్రస్తుతం బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నాడు తనకి కూడా ఫౌండేషన్ ద్వారా చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని అందించానని , పేద విద్యార్థులకు కూడా సహాయం చేసానని అన్నారు. మానవుడిగా పుట్టినందుకు మనకంటూ మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నానని బీఎన్ రావు చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget