By: ABP Desam | Updated at : 22 Mar 2023 04:08 PM (IST)
ప్రగతి భవన్‌కు చేరుకున్న కవిత - 24న సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ ! ( Image Source : PTI )
Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుసగారెండు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకి వచ్చారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ మరి కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు వివరించి.. తదుపరి న్యాయనిపుణులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ ఎప్పుడు హాజరు కావాలన్నదానిపై ఈడీ సమాచారం పంపుతామని చెప్పింది కానీ.. ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో కవిత మళ్లీ ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారు..ఎప్పుడు మళ్లీ విచారణ ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు.
మరో వైపు ఈడీ దర్యాప్తుపై కవిత వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో మార్చి 24న విచారణ జరగనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడంపై స్టే ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. మహిళను ఇంటి వద్దే విచారించాలనే సిఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తుందని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తనకు ఇచ్చిన ఈడీ నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని, అందుకు విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరించారని కవిత ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్లు సీజ్ చేశారని కవిత ఆరోపించారు. ఇంటికి వెళ్లి విచారించాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కవిత పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈడీ నోటీసులపై స్టే ఇవ్వడానికి నిరాకరించారు. మార్చి 24న కవిత పిటిషన్‌పై విచారణ జరుపుతామని ప్రకటించారు.
మరో వైపు కవిత పిటిషన్ వి,యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తులను విచారిస్తున్న ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తన పిటిషన్ లో ప్రస్తావించింది ఈడీ. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది ఈడీ. ఈ నెల 24న కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత వేసిన పిటిషన్ పై ఈడీ వేసిన కేవియట్ పిటిషన్ ను ను కూడా సుప్రీం అదే రోజున విచారించనుంది. ఇరు వర్గాల వాదనలను సుప్రీం విననుంది.
ముందుగా సుప్రీంకోర్టు విచారణపూర్తయ్యే వరకూ విచారణకు హాజరయ్యేది లేదని కవిత సీబీఐకి లేఖ రాశారు. కానీ తర్వాత మనసు మార్చుకున్నారు. వరుసగా రెండు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇరవై నాలుగో తేదీన సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ కీలకం కానుంది.
Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైదరాబాద్ లో ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు
TSPSC News : తవ్వకొద్దీ అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?
Top 5 Headlines Today: సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి! రైలు ప్రమాద ఘటనపై జగన్, కేసీఆర్ దిగ్భ్రాంతి? టాప్ 5 హెడ్ లైన్స్
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?