అన్వేషించండి

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

Gadwal News : జోగులాంబ గద్వాల్ జిల్లాలో సెల్ ఫోన్ ఛార్జర్ తీస్తుండగా బాలికకు షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది.

Gadwal News : జోగులాంబ గద్వాల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సెల్‌ఫోన్ ఛార్జర్ పదేళ్ల బాలికను బలితీసుకుంది. 10 ఏళ్ల బాలిక నిహారిక స్విచ్ బోర్డ్ ప్లగ్ నుంచి సెల్ ఫోన్ ఛార్జర్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ సరఫరా లైన్లలో సమస్య కారణంగా ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ సమయంలో హై వోల్టేజీ సరఫరా అయిందని అంటున్నారు.

అసలేం జరిగింది? 

జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఛార్జింగ్‌లో ఉన్న సెల్ ఫోన్‌ తీస్తుండగా షాక్‌ తగిలి నిహారిక అనే పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. నిహారిక స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. కూతురు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.  ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడవద్దని, పిల్లలను ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ లో మాట్లాడుతుండగా పేలిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఫోన్ ఓవర్ హీట్ కారణంగా ప్రమాదాలు జరిగాయి. నిత్యం ఉపయోగించే సెల్ కూడా కొన్నిసార్లు తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. సెల్ ఫోన్ వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఇలాంటి ఘటనలు మనకు తెలియజేస్తున్నాయి. 

చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి

 ఆ తండ్రి విదేశాల నుంచి చాక్లెట్లు తీసుకొచ్చారు. ఎంతో ఆనందంగా తన పిల్లలకు వాటిని ఇచ్చాడు. అయితే అదే చాక్లెట్ తన ముద్దుల కుమారుడిని బలితీసుకుంటుందని ఊహించలేకపోయాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ లో జరిగింది.  ఓ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చిన చాక్లెట్‌ అతని కుమారుడి ప్రాణం తీసింది. చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ నగరంలో ఇటీవల జరిగింది. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకుతెరువు కోసం వరంగల్‌ వచ్చి డాల్ఫిన్‌ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

ఊపిరాడక 

స్థానిక శారద పబ్లిక్‌ స్కూల్‌లో వారి చిన్నారులు చదువుతున్నారు. ఇటీవల కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు. వీరిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది బాలుడి తండ్రికి సమాచారం అందించారు. చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget