By: ABP Desam | Updated at : 13 Feb 2023 09:58 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వైఎస్ షర్మిల
YS Sharmila : సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జనగాం బస్టాండ్ వద్ద బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ షర్మిల.. జనగాం ఎమ్మెల్యే ముత్తి రెడ్డి కాదు కబ్జా రెడ్డి అని మండిపడ్డారు. ఈ కబ్జారెడ్డిని కేసీఆర్ బాగా మేపుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ పై నిన్న అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను షర్మిల తప్పుబట్టారు. ఎవరు బొంకుడు మాటలు చెప్పేది కేసీఆర్ అంటూ మండిపడ్డారు. 33 ప్రాజెక్టులు కట్టినందుకు వైఎస్సార్ బొంకుడు గుంత అయ్యారా అని ప్రశ్నించారు. బొంకుడు మాటలు చెప్పే అలవాటు తమకే ఉందన్నారు. పథకాలు పేరు చెప్పి బొంకుడు మాటలు చెప్పింది మీరు కాదా అన్నారు. మహానేత వైఎస్ఆర్ ఎక్కడ, మీరెక్కడ అని ప్రశ్నించారు.
రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో
రేవంత్ పాదయాత్ర అనే పదాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. రేవంత్ చేస్తున్నది దొంగ యాత్ర. ఆయన ఏ యాత్ర చేస్తున్నారో వాళ్ల పార్టీ నేతలకే అర్థం కావడం లేదట అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందన్నారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాదు కబ్జారెడ్డి. దారిలో వస్తుంటే ఎమ్మెల్యే పాలన గురించి అడిగాను. ఈయన కబ్జారెడ్డి అని ప్రజలే చెప్తున్నారు. దాదాపు 500 ఎకరాలు కబ్జా చేశారట. కేసీఆర్ కి ఒక ఫామ్ హౌజ్ అయితే ఈయనకు మూడు ఫామ్ హౌజ్ లు అంట. ఒక ఫామ్ హౌజ్ కోసం ఏకంగా గిరిజన తండానే ఖాళీ చేయించాడని చెప్పారు. ఏ భూమి వదలడట..అన్ని భూములు మాయం చేస్తారట. ఈయన ఒకప్పుడు చైన్ మెన్ ఉద్యోగం చేసేవాడట. కొలతలు వేసే ఉద్యోగం చేసి రెవెన్యూ శాఖలో అన్ని లొసుగులు కనుక్కున్నారు. ముస్లిం భూములు, గిరిజన భూములు, చెరువులు అన్నీ కబ్జాలే. ఈయన కబ్జా కోర్ అని నేను కాదు ఏకంగా ఒక మహిళ ఐఏఎస్ రిపోర్ట్ ఇచ్చారు. కబ్జా చేస్తే కొడుకునైన వదలనుఅన్నారు కేసీఆర్. మరి ఈయన కబ్జా చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఈ కబ్జారెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఐఏఎస్ అధికారినే ట్రాన్స్ఫర్ చేశారు. " - వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ పేరు పలికే అర్హత కేసీఆర్ కు లేదు
వైఎస్సార్ జలయజ్ఞం ద్వారా తెలంగాణలో 33 ప్రాజెక్ట్ లు తలపెట్టారని వైఎస్ షర్మిల తెలిపారు. 18 మేజర్ ప్రాజెక్టులు, 12 మీడియం ప్రాజెక్ట్ లు వైఎస్సార్ పనులు ప్రారంభించారన్నారు. ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇలా చెప్తే ఎన్నో ప్రాజెక్టులు వైఎస్సార్ ప్రారంభించారన్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడే 80 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. ఇప్పుడు మిగిలిన 20 శాతం పనులను కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. నిజానికి బొంకుడు మాటలు చెప్పింది కేసీఆర్ అని విమర్శించారు. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి కేసీఆర్ బొంకుడు మాటలు చెప్పారని విమర్శించారు. ఆ రోజు రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే 16 ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లి అని చెప్పి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో మీకే తెలియదన్నారు. వైఎస్సార్ పేరు పలికే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. వైఎస్సార్ దేవుడు అయితే కేసీఆర్ దెయ్యం అని విమర్శించారు. వైఎస్సార్ చనిపోతే 700 వందల మంది ఆయన వెనకాలే వెళ్లిపోయారన్నారు. రుణమాఫీ, ఇంటికి ఒక ఉద్యోగం, సున్నా వడ్డీకే రుణాలు అని అబద్ధాలు చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?
Karimnagar News: ఉగాది పండుగ చేసుకునే పరిస్థితి లేదు, నష్టపోయిన పంటల్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటల
Kavitha : ప్రగతి భవన్‌కు చేరుకున్న కవిత - 24న సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ !
Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల
RRB Group D Result: రైల్వే 'గ్రూప్-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!