News
News
X

Minister KTR : రాజకీయ నిరుద్యోగుల పనికిమాలిన పాదయాత్రలు, రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ పై కేటీఆర్ సెటైర్లు

Minister KTR : రాష్ట్రంలో కొందరు రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

FOLLOW US: 
Share:

Minister KTR : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో 150 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 1.55 గంటలకు సోడాషపల్లి లోని రైతు వేదిక ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకున్నారు.  మంత్రి జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్ సీపీ రంగనాథ్ ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే తాటికోండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఎత్తైన ప్రాంతాలైన  చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల పైప్ లైన్ ద్వారా 3 మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ మూడు మినీ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం రూ.104 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం నిర్మించనుంది. 3 లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వేలూరు మండల కేంద్రం వరకు 25 కోట్లతో వేసిన డబుల్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం నారాయణగిరి నుంచి పీచురు వరకు రూ.10 కోట్లతో  వేసే డబుల్ రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సోడాషపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.  

 మాది కుటుంబ పాలనే - కేటీఆర్ 

ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నాయన్నారు. మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యకు కారణమైన ఎవరినీ వదిలిపెట్టమన్నారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామన్నారు. కేసీఆర్‌ను విమ‌ర్శిచేందుకు విప‌క్షాల‌కు కార‌ణం దొర‌క‌ట్లేదన్నారు. ఏ త‌ప్పు దొర‌క్క కుటుంబ పాల‌న అంటూ కేసీఆర్‌ను విమ‌ర్శిస్తున్నారని మండిపడ్డారు. మాది ముమ్మాటికీ కుటుంబ పాల‌నే అని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ.125 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌ చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజ‌లంతా మా కుటుంబ స‌భ్యులే అన్నారు. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగ‌స్వామే అని తెలిపారు. ఆస‌రా పింఛన్ లతో వృద్ధుల‌ను క‌డుపులో పెట్టుకున్నారన్నారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు పేదింటి ఆడ‌బిడ్డల‌కు కేసీఆర్ మేన‌మామ అయ్యారన్నారు.  

పనికిమాలిన పాదయాత్రలు

కొంత మంది రాజ‌కీయ‌ నిరుద్యోగులు ప‌నికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పాదయాత్రలు చేస్తూ ప్రజ‌ల‌ను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మీ పార్టీకి  10 ఛాన్సులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో క‌రెంట్, నీళ్లు లేక తెలంగాణ రైత‌న్నలు ఆత్మహ‌త్యల చేసుకున్నారన్నారు. తెలంగాణ‌లో అమాయ‌కులు ఎవ‌రూ లేరని కేటీఆర్ అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏంచేశారని ప్రశ్నించారు. ఒక్కో ఎక‌రానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌ గత ప్రభుత్వాలకు ఎందుకు రాలేదన్నారు.  క‌రెంట్, సాగు, తాగు నీరు ఇవ్వరు, ఇప్పుడేమో ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుక్కుంటున్నారని కేటీఆర్ మండిప‌డ్డారు.

 

 

Published at : 27 Feb 2023 06:12 PM (IST) Tags: CONGRESS Padayatra Revanth Reddy BRS Minister KTR Jangaon

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

Hyderabad News :  నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం