అన్వేషించండి

Weather Update: ఎండల నుంచి బిగ్ రిలీఫ్, తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు

Telangana Weather News: తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Telangana Weather Update: ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ దాటింది.  శుక్రవారం నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. ముందుగా రుతుపవనాలు మే 31న కేరళకు చేరుకుంటాయని భావించగా,  ఒకరోజు ముందుగానే అంటే మే 30వ తేదీకే కేరళ తీరానికి చేరుకుంది.  శుక్రవారం కేరళలోని మిగిలిన మరి కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.  ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి  వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

ఉరుములు, మెరుపులతో వర్షం
రేపు అంటే శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ,  వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు  ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. అలాగే వచ్చే నెల రెండో తారీఖున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌,  రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో  అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  

హైదరాబాదీలకు కూల్ న్యూస్
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎండలు దంచి కొడుతున్న వేళ వాతావరణ శాఖ రాజధాని వాసులకు శుభవార్త చెప్పింది.  హైదరాబాద్ పరిసరాల్లోని అన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు  వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ పేర్కొంది. నగరంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. జూన్ 2న చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి తదితర మండలాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 4వరకు ఎల్లో అలెర్ట్ ఆచరణలో ఉంటుంది. 

ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటింది. గురువారం  మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలలో 47 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  మంచిర్యాలలో 47.2 డిగ్రీలకు, భద్రాద్రి కొత్తగూడెంలో 47.1, ఖమ్మంలో 47 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. హైదరాబాద్‌ విషయానికి వస్తే అంబర్‌పేటలో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ వాతావరణ శాఖ మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.  జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Tummidi Hatti Barrage: తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి వాటర్ డిప్లొమసీ - ఉత్తర తెలంగాణ దాహార్తి తీర్చే బిగ్ స్కెచ్ - అడుగు ముందుకు పడినట్లేనా?
తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి వాటర్ డిప్లొమసీ - ఉత్తర తెలంగాణ దాహార్తి తీర్చే బిగ్ స్కెచ్ - అడుగు ముందుకు పడినట్లేనా?
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Embed widget