News
News
వీడియోలు ఆటలు
X

వివేక హత్య కేసులో సీబీఐకి అవినాష్‌ రెడ్డి లేఖ- నాలుగు రోజుల సమయం కావాలని విజ్ఞప్తి

సీబీఐకి అవినాష్ రెడ్డి షాక్ ఇచ్చారు. సడెన్‌గా పిలిస్తే తాను విచారణకు రాలేనని... తనకు నాలుగు రోజుల టైం కావాలంటూ లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

వివేక హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి లెటర్ రాశారు. విచారణకు రావాలని తనకు షార్ట్ నోటీసు ఇచ్చారని తనకు వచ్చేందుకు టైం లేదన్నారు. కనీసం నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నంగదును విచారణకు హాజరుకాలేనని చెప్పారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నిన్న సాయంత్రం సీబీఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో మంగళవారం హాజరు కావాలని ఆదేశించంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తేనే చాలా విషయాలు తెలుస్తాయని ఇప్పటికే సీబీఐ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగనిస్టే కూడా ఇవ్వలేదు. సీబీఐ తని తాను చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అరెస్టులకు ఎలాంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ సీబీఐ ఇంకా .. అవినాష్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా నోటీసులు జారీ చేయడంతో అరెస్టుపై మరోసారి ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. 

ఏం జరుగుతుందనే సందేహం ఉన్న టైంలో అవినాష్‌రెడ్డి సీబీఐకి ఝలక్ ఇచ్చారు. తనకు ఇంత సడెన్‌గా చెబితే ఎలా రాగలనంటూ ప్రశ్నించారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న పనులు చాలానే ఉన్నాయని ఆయన రాసిన లేఖలో వివరించారు. చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయని చెబుతూ హైదరాబాద్‌ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లిపోయారు. 

అవినాష్ రెడ్డిపై సీబీఐ కీలక ఆరోపణలు
వైఎస్ వివేకా హత్య కేసులో  సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకెళ్లింది.  వివేకా హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ పాత్రపైన ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టటం, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలో అవినాష్ భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి, తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది. హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడ ఉందన్నది కస్డడీ లో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది, హత్య తరువాత 2019 మార్చి 15వ తేదీ తెల్లవారు జామున 1.58 గంటలకు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు గుగూల్ టేక్ ఔట్ ద్వారా తేలిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అవినాశ్‌ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని... ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.
 
ఆరోసార్లు అవినాష్‌ను విచారించిన సీబీఐ  

ఇప్పటికి ఆరు సార్లు ఎంపీ అవినాష్ సీబీఐ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ముందస్తుగా పెట్టుకున్న పనులు ఉన్నాయని ఇవాళ్టి విచారణకు హాజరు కాలేదు. దీనిపై సీబీఐ ఏం చేయబోతుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. 

ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు

ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. బెయిల్ పై బయటికొస్తే ఉదయ్ సాక్షులను ప్రభావితం చేస్తాడని తెలిపారు. వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది. అంతేకాదు, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ పునరుద్ఘాటించింది. హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ ప్రమేయం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను  కోర్టు కొట్టి వేసింది.

Also Read: అధికారంలో ఉంటే అమరావతిలో లేకుంటే జూబ్లీహిల్స్‌లో- టీడీపీ చంద్రబాబు వెంటిలేటర్‌పై ఉన్నారు: జగన్

Also Read: ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాక్ - ఆ రూల్ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం!

Published at : 16 May 2023 11:16 AM (IST) Tags: ABP Desam CBI Viveka Murder Case breaking news Avinash Reddy

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!