By: ABP Desam | Updated at : 10 Mar 2023 11:16 AM (IST)
దీక్షలో మాట్లాడుతున్న సీతారాం ఏచూరి
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని కవిత దీక్ష బూనారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమె ఒక్కరోజు దీక్షకు దిగారు. దీనికి జాతీయ, రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించింది. భారీ సంఖ్యలో మహిళా నేతలు వచ్చి దీక్షలో కూర్చున్నారు. వేదికపై పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు కవిత.
కవిత చేస్తున్న దీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపి దీక్షను ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనలో బీఆర్‌ఎస్ నేత చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.
దీక్ష ప్రారంభం సందర్భంగా మాట్లాడిన కవిత... బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, వారి ఎదుగుదలపై చిత్తశుద్ధి ఉంటే మాత్రం వెంటనే పార్లమెంట్‌లో మహిళా బిల్లుకు ఆమోదం తెలిపాలని డిమాండ్ చేశారు. పూర్తి మెజార్టి ఉన్న వేళ ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. అలా ఆమోదించి వరకు బీజేపీని వెంటాడుతామన్నారు. అప్పటి వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
27 years later, Women’s Reservation Bill still continues to be absent from the Parliament.
Together, we will ensure that 33% Women’s Reservation Bill is a reality.
I thank @cpimspeak & @SitaramYechury Ji for joining this movement today. https://t.co/5W4J35SWnE pic.twitter.com/l0KVM9LMo5 — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 10, 2023
బీల్లు ఆమోదించేందుకు బీజేపీ ముందుకు వస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు కవిత. చాలా కాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ఇప్పుడైనా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారామె. 1996 దేవెగౌడ హయాంలో పార్లమెంట్ ముందుకు వచ్చిన బిల్లుకు నేటికీ మోక్షం లభించకపోవడం చాలా బాధాకరమన్నారు.
భారీగా బీఆర్‌ఎస్ లీడర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ దీక్ష సాయంత్రం నాలుగు గంటల వరకు సాగనుంది.
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?
Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని
నేడు సుప్రీంలో విచారణకు కవిత పిటిషన్ - ఈడీపై కేసులో ఏం జరగబోతోంది?
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!