Diwali Vacation 2022: ఉద్యోగులకు కృతజ్ఞతగా 10 రోజుల దీపావళి సెలవులు- ఓ ప్రైవేట్ కంపెనీ ఆఫర్
Diwali Vacation 2022: వుయ్ వర్క్ కంపెనీ ఈ ఏడాది దీపావళి సందర్భంగా భారతీయ ఉద్యోగులందరికీ 10 రోజుల పూర్తి సెలవు ప్రకటించింది.
![Diwali Vacation 2022: ఉద్యోగులకు కృతజ్ఞతగా 10 రోజుల దీపావళి సెలవులు- ఓ ప్రైవేట్ కంపెనీ ఆఫర్ WeWork Company has declared 10 days holiday for all its Indian employees on Diwali this year Diwali Vacation 2022: ఉద్యోగులకు కృతజ్ఞతగా 10 రోజుల దీపావళి సెలవులు- ఓ ప్రైవేట్ కంపెనీ ఆఫర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/10/07feb93ddc4d4fc96fbc4312cd4a7f791665424603611215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Diwali Vacation 2022: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ దీపావళి రోజున తమ కుటుంబంతో కలిసి పండుగను జరుపుకోవాలని ఆలోచిస్తారు. కానీ కొన్ని సంస్థలో అధిక పని కారణంగా సెలవులు తీసుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగులు లోలోపే కుమిలిపోతుంటారు. ఇవన్నీ కాదని.. ఉద్యోగుల ఆనందమే తమ సంస్థ పని తీరు మెరుగుపడేందుకు కారణమవుతుందని గ్రహించి ఈ ఏడాది దీపావళికి సెలవు ప్రకటించింది. వుయ్ వర్క్ పీపుల్ అండ్ కల్చర్ చీఫ్ ప్రీతి శెట్టి తమ సంస్థలోని భారతీయ ఉద్యోగులందరికీ 10 రోజుల పూర్తి సెలవును ప్రకటించారు.
పనిని స్విచ్ ఆఫ్ చేయండి
ఈసారి దీపావళి సందర్భంగా పనిని ఆపివేసి కుటుంబంతో కలిసి దీపావళిని జరుపుకోవాలని ప్రీతి శెట్టి చెప్పారు. "ఒక బ్రాండ్‌గా ఎన్నో విజయాలు మా ఉద్యోగులు చేసిన కృషి ఫలితంగానే సాధించామన్నారు. 10 రోజుల దీపావళి విరామం ప్రతి ఉద్యోగి జీవితాన్ని రీసెట్ చేస్తుందని భావిస్తున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లోని 40 ప్రదేశాల్లో ఈ కంపెనీ విస్తరించి ఉంది.
భారతీయ ఉద్యోగులకు ప్రత్యేక బహుమతి
న్యూయార్క్‌కు చెందిన ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ వుయ్ వర్క్ ఈ పండుగ సీజన్లో తమ భారతీయ ఉద్యోగులకు ప్రత్యేకమైన దీపావళి కానుక ఇచ్చింది. పండుగ సీజన్‌లో ఈ సెలవులు తమ ఉద్యోగులకు పెద్ద విరామంగా భావిస్తోందా కంపెనీ. ఉద్యోగులు తమ పనిని స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా తమ కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోవచ్చని చెప్పింది. ఇది తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చినట్టని అభిప్రాయపడింది.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
ఉద్యోగుల్లో పని ఒత్తిడి తగ్గించి పండుగ ఉత్సాహాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వుయ్ వర్క్ కంపెనీ తెలిపింది. బిజీగా ఉండే లైఫ్ నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తే ఉద్యోగులు తమ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం ఇచ్చినట్టు అవతుందని ఇది తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. ఎంప్లాయీ ఫస్ట్ అనే భావనలో అటువంటి పాలసీని మొదటిసారిగా 2021లో ప్రవేశపెట్టారు.
వర్క్ లైఫ్ రీసెట్ అవుతుంది
ప్రీతి శెట్టి మాట్లాడుతూ..." ఇప్పటివరకు 2022 మాకు చాలా ముఖ్యమైనది. ఈ ఏడాదిలోనే మా వ్యాపారం విస్తృతమైంది. ఒక బ్రాండ్‌గా మా ఉద్యోగులు చేసిన కృషి ఫలితంగానే ఎన్నో విజయం సాధించాం. అందుకే ఉద్యోగులకు కృతజ్ఞత చెప్పడానికే 10 రోజుల దీపావళి సెలువులు ఇస్తున్నాం. ఈ విధంగా తమ వర్క్ లైఫ్‌ను రీసెట్ చేసుకునే అవకాశాన్ని ప్రతి ఉద్యోగి పొందుతారు.
మీషో 11 రోజుల సెలవు ఇచ్చాడు
ఇటీవల, ఆన్లైన్ షాపింగ్ సైట్ మీషో కూడా తన ఉద్యోగులకు ఇలాంటి బంపర్ ఆఫర్ అందించింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు మీషో తన ఉద్యోగులకు 11 రోజుల 'రీసెట్ అండ్ రీఛార్జ్' విరామం ఇచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)