By: ABP Desam | Updated at : 19 Jul 2023 05:07 PM (IST)
Edited By: Pavan
హైదరాబాద్ టూ అంటార్కిటికా, అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చిన బిర్లా సైన్స్ సెంటర్ ( Image Source : gpbaasri.org )
Antarctica Experience Room: భూమికి దక్షిణ ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికాలో మనుగడ కష్టం. ఈ అత్యంత శీతల ప్రాంతం గురించి మానవాళికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతం నుంచి అంతరిక్షంలోని ఎన్నో విషయాల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునే వీలు కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి మరింత ఎక్కువ స్పేస్ డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. భూమిపై ఉండే ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ఆర్బిట్లు మాత్రమే కనిపిస్తుంటాయి. హైదరాబాద్ నుంచి అయితే కేవలం రెండే ఆర్బిట్లను వీక్షించవచ్చు.
అంటార్కిటికా నుంచి ఏకంగా 10 కంటే ఎక్కువ ఆర్బిట్లు కనిపిస్తాయి. ఇతర దేశాల నుంచి కూడా ఇంత ఎక్కువ స్థాయిలో ఆర్బిట్లు కనిపించే అవకాశం లేదు. అందుకే రోదసిలోని అంశాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రపంచ దేశాలు అంటార్కిటికాలో గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాట్లు చేసుకుంటాయి. ఇస్రో కూడా అంటార్కిటికాలో ఓ గ్రౌండ్ స్టేషన్ ను నిర్మించింది. అయితే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి.. అక్కడి గ్రౌండ్ స్టేషన్ ఎలా ఉంటుంది.. అత్యంత శీతల ప్రాంతంలో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు ఎలా సాగిస్తారు.. ఎలా జీవిస్తారు.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అనే విషయాల గురించి విద్యార్థులు తెలుసుకునేలా బిర్లా ప్లానిటోరియం ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటార్కిటికా గ్రౌండ్ స్టేషన్ తో లైవ్ ఇంటరాక్షన్ ఎక్స్‌పీరియన్స్ ను ఇచ్చేందుకు.. అంటార్కిటికా ఎక్స్‌పీరియన్స్ రూమును ప్రారంభించింది.
అంటార్కిటికాలో ఇస్రో భారతి స్టేషన్ లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కోసం అంటార్కిటికా గ్రౌండ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ ద్వారానే స్పేస్ డేటాను సేకరిస్తారు. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో ఈ డేటా కీలక పాత్ర పోషిస్తోంది. మరింత కచ్చితత్వంతో ప్రయోగాలు చేపడుతోంది. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, సముద్ర వాతావరణం వంటి సమాచారాన్ని సేకరించి దేశ ప్రజలకు చేరవేస్తున్నారు.
ఈ అంటార్కిటికాలోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ లో పని చేసే ఇస్రో శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే వీలు కల్పించింది బిర్లా సైన్స్ సెంటర్. దేశంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు లైవ్ ఎక్స్‌పీరియన్స్ ఇంటరాక్షన్ రూమ్‌ను బిర్లా ప్లానిటోరియం స్పేస్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా అక్కడ స్టేషన్ లోని నలుగురు సైంటిస్టులతో లైవ్ ఇంటరాక్షన్ అయ్యేలా ప్రత్యేక రూమును ఏర్పాటు చేశారు. ఈ రూమ్ తో అక్కడి పరిస్థితులపై ఇక్కడి నుంచి విద్యార్థులు వివరాలు తెలుసుకుంటారు. ఖగోళ విషయాల్లో పలు అంశాలపై అవగాహన పెంచుకునే వీలు ఉంటుంది. విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు ఇస్రోతో కలిసి బిర్లా ప్లానిటోరియం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటార్కిటికా గ్రౌండ్ స్టేషన్ లో నలుగురు ఇస్త్రో శాస్త్రవేత్తలు విద్యార్థులతో కలెక్ట్ అయ్యారు. అక్కడి శీతల పరిస్థితులను స్టూడెంట్స్ కు వివరించారు. అక్కడ ఎలా ఉంటారు, ఎలాంటి ఆహారం తింటారు, ఏమేం తింటారు లాంటి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాధానాలు ఇచ్చారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి
TSSPDCL Jobs: విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి
Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం
KNRUHS: బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>