అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

TSRTC News: శ్రీశైలం వెళ్లాలంటే ఇక చాలా సింపుల్! గుడ్‌న్యూస్‌ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ

ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు ఉంటుంది.

ఆధ్యాత్మిక యాత్రలకు ప్రయాణికుల నుంచి వస్తున్న అనూహ్య స్పందన కారణంగా టీఎస్ఆర్టీసీ ఆ దిశగా మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవలే అరుణాచలానికి నడిపిన ప్రత్యేక బస్సులకు విపరీతమైన గిరాకీ వచ్చింది. తాజాగా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ప్రతి వారాంతంలో జేబీఎస్‌ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. 

ఈ టూర్ రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి, సాక్షి గణపతి ద‌ర్శనంతో పాటు పాతాళ‌గంగ, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను ప్రయాణికులు చూసేలా ఏర్పాట్లు చేశారు. 

ధర ఎంత? ఎప్పుడు ప్రారంభం?

ఈ శ్రీశైలం టూర్ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఛార్జీల్లో భాగంగా రవాణా, బస, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ ఛార్జి ప్యాకేజీలో ఉంటుంది. ఆహారం, అల్పాహారం, ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు లాంటి ఇతర ఖర్చులను ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు ఉంటుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌.. మీదుగా మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుంది. ముందుగా బస కోసం డైరెక్ట్ గా హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనాలు ఉంటాయి. తర్వాత 3 గంటలకు పాతాళ గంగకు తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రికి ఆ హోటల్లోనే బస ఉంటుంది.

రెండో రోజు షెడ్యూల్ ఇలా

రెండో రోజైన ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోడానికి వీలు కల్పించారు. తర్వాత అల్పాహారం ఉంటుంది. హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం లాంటి స్థానిక ప్రాంతాలు చూడవచ్చు.

అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం లాంటివి చూసే ఏర్పాట్లు ఉంటాయి. తిరుగు ప్రయాణం మధ్యలో మధ్యాహ్న భోజనం కోసం బస్సు ఆపుతారు. తర్వాత రాత్రి 7.30 గంటలకు బస్సు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు చేరుతుంది. 

ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

ఇకపై ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత టిక్కెట్ల కోసం డిజిటల్ చెల్లింపులు చేసేలా  ఏర్పాట్లు చేయబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కండక్టర్ కు డబ్బులు చెల్లించకుండా బస్సులోని ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా చెల్లించి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం కసరత్తులు పూర్తి చేసింది. నగదు రహిత టికెట్ కొనుగోలు పద్ధతిని ప్రవేశ పెట్టాలని గతేడాది చివర్లోనే ఆర్టీసీ భావించినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Meeting With Saranya: ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
KTR: కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
Telangana Rains: తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Election Results 2026: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
West Bengal CM Suvendu Sdhikari: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
Tamil Nadu Assembly Election Results: విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
Assam Assembly Elections: అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
YSRCP: వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
Assembly Election Results 2026 Live Updates: బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
Embed widget