By: ABP Desam | Updated at : 18 Jan 2023 10:09 AM (IST)
Edited By: jyothi
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఎక్కడెక్కడ, ఎప్పటి నుంచో ఓసారి చూడండి!
Hyderabad Traffic Restrictions: నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. సోమాజిగూడ నుంచి రాజీవ్ గాంధీ స్టేడియం వరకు సాగే రహదారిలో ఈ ఆంక్షలు ఉంటాయని వివరించారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో ఉండే వారంతా పైన పేర్కొన్న మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) January 18, 2023
Commuters are requested to note the #TrafficAlert in view of one day cricket match b/w India & Newzealand on 18th January 2023 at Rajiv Gandhi International Cricket Stadium, Uppal. #TrafficAdvisory @AddlCPTrfHyd pic.twitter.com/xXJHbGhMIj
హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ వాలాషన్ అలియాస్ ప్రిన్స్ ముకర్రంజా బహదూర్ అంత్యక్రియలు బుధవారం రోజు మక్కా మసీదులో జరగనున్నాయి. కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున... మక్రా మసీదు పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) January 17, 2023
Hyderabad Traffic Police officers during the intervening nights of 17th & 18th January, 2023.@AddlCPTrfHyd pic.twitter.com/zVcq2uuRts
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?