Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లలో వెళ్లకపోవడం బెటర్
PM Modi to visit Telangana on November 12: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
Traffic Diversions in Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయంలో బీజేపీ ముఖ్య నేతలతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 2.15 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ రామగుండం బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నాం 3.30కు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
Hyderabad Traffic Diversions : ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పురా, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. సోమాజిగూడా, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ సిగ్నిల్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలున్నాయన్నారు. రేపు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ (PM Modi to visit Hyderabad on November 12)లో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి గనులున్న ప్రాంతాల్లో నరేంద్ర మోదీ 'గో బ్యాక్' అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వామపక్ష పార్టీలతో పాటు సింగరేణి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకున్నారు. ఇదే క్రమంలో గురువారం రామగుండం సింగరేణి సంస్థలోని అన్ని బొగ్గు గనులలో జాతీయ కార్మిక సంఘాల జేఏసీతో పాటు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) సైతం మోదీ గో బ్యాక్... అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు.
ప్రొటోకాల్ వివాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12వ తేదీన తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు .. ఈ ఆరోపణల్ని ఖండించాయి. రామగుండం ప్లాంట్ సీఈవో స్వయంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పంపిన ఆహ్వాన లేఖను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించారన్నారు. ఈ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు.
ప్రోటోకాల్ వివాదాన్ని లేవనెత్తిన టీఆర్ఎస్
ప్రధాని మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ ఈవెంట్ కోసం పంపిన ఆహ్వానంలో కేంద్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ను పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణలో అధికారిక భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానించిందని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ పేరు తర్వాత అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేరును చేర్చలేదని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న ఫ్యాక్టరీ ఈవెంట్లో సీఎంకు నామమాత్రంగా ఆహ్వానం పంపి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని తమ ట్వీట్లో పేర్కొన్నారు.