Hyderabad Stadium Collapse: హైదరాబాద్‌లో ప్రమాదం, కూలిన స్టేడియం పైకప్పు - ముగ్గురు దుర్మరణం!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో ఈ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులు చేస్తున్న దాదాపు 14 మంది కూలీలు గోడ కింద చిక్కుకున్నారు.
హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇండోర్ స్టేడియంలో ప్రమాదం జరిగింది. పైకప్పు కూలడం వల్ల ముగ్గురు కూలీలు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 20 మంది కూలీలు పని చేస్తున్నట్లుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో ఈ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులు చేస్తున్న దాదాపు 14 మంది కూలీలు గోడ కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో 12 మందిని బయటకు తీసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాలను పూర్తిగా తొలిగించిన తర్వాత మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిర్మాణంలో నాణ్యత లేకపోవటం వల్ల నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలిందా? లేదా డిజైన్ లోపమా? అనేది విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.