అన్వేషించండి

Telangana TET: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల- పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది విద్యాశాఖ.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్. డీఎస్సీ కోసం అవసరమయ్యే టెట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. జూన్‌ 12 టెట్‌ నిర్వహిస్తారు. 

టెట్‌ కు అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 2015డిసెంబల్‌ 23న టెట్‌కు సంబంధించిన రెండు సవరణలు చేసింది ప్రభుత్వం. బీఈడీ పూర్తి చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అర్హమైన పేపర్‌-1 కూడా రాసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రిడ్జ్‌ కోర్సు పూర్తి చేయాలని చెప్పింది. అది ఆరునెలలు ఉంటుంది. ఒకసారి టెట్‌లో అర్హత మార్కులు సాధిస్తే అది జీవితాంతం వర్తిస్తుందని కూడా సవరించింది.

ఈ మధ్య జరిగిన శాసన సభ సమావేశాల్లో తెలంగాణ వ్యాప్తంగా 13 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీలు గుర్తించామని వాటిని భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. కోచింగ్ సెంటర్‌లు కిటకిటలాడటం మొదలయ్యాయి. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రావడంతో ప్రిపరేషన్ మరింత ఊపందుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. 

ఇప్పటి వరకు బీఈడీ చేసిన వాళ్లు ఆరు నుంచి పది తరగతుల వరకు బోధించేందుకు అర్హులగా ఉండే వాళ్లు 2008 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అందుకే వాళ్లు రెండో పేపర్‌ మాత్రమే రాసేవాళ్లు. కానీ ఈ మధ్య కాలంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా బీఈడీ చేసిన వాళ్లు బోధించవచ్చని నిర్ణయించింది. అంటే ఎస్జీటీ పోస్టులకు కూడా వీళ్లు అర్హులని తేల్చింది ప్రభుత్వం. దీనికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అభ్యర్థులు ఆరునెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇకపై మొదటి పేపర్‌ కూడా రాసేందుకు బీఈడీ చేసే వాళ్లు అర్హులు అవుతారు. 

ఒకసారి టెట్‌ అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు అది చెల్లుబాటు అయ్యేది. ఆ తర్వాత మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెట్‌ను జీవితాంతం విలువ ఉండేలా నిబంధనలు మార్చారు. 2011 ఫిబ్రవరి 11 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా జీవితాంతం డీఎస్సీ రాసుకోవడానికి వాళ్ల వాళ్ల రిజర్వేషన్ల బట్టి అర్హులు అవుతారు. 

టెట్‌ 150 మార్కుల పరీక్ష. టెట్ రాసిన వాళ్లు ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 90 మార్కులు అంటే అరవై శాతం, బీసీలు 75 మార్కులు అంటే యాభై శాతం, ఎస్సీఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు అంటే నలభై శాతం వస్తే చాలు. ఈ మార్కులు డీఎస్సీలో ఇరవై శాతం వెయిటేజ్‌ ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
Janwada Farmhouse: అది కేటీఆర్‌ సొత్తు కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై ప్రదీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అది కేటీఆర్‌ సొత్తు కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై ప్రదీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
MLA Danam Nagender Disqualification: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Asian Games Mess: జపాన్ బయల్దేరే ముందు క్రికెటర్లకు జెర్సీ కష్టాలు.. సరిపోని కిట్స్, ఇరుకైన గదులతో ఇబ్బందులు.. రంగంలోకి బీసీసీఐ 
జపాన్ బయల్దేరే ముందు క్రికెటర్లకు జెర్సీ కష్టాలు.. సరిపోని కిట్స్, ఇరుకైన గదులతో ఇబ్బందులు.. రంగంలోకి బీసీసీఐ 
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Adilabad Adivasis: అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
IND VS BAN, Asian Games Semifinal: బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Embed widget