అన్వేషించండి

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

Telangana Politics: తెలంగాణలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బదులుగా సీఎం కేసీఆర్ రాసిన రాజ్యాంగం అమలు అవుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. 

Telangana Politics: భారత రాజ్యాంగాన్ని రాసిన మేధావి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కు తనతో పాటు, పార్టీ శ్రేణులంతా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. అస్పృశ్యత అనే భయంకరమైన వ్యాధిని రూపు మాపడంలో అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేటికీ ఎస్సీలకు అన్యాయం జరుగుతూనే  ఉందని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే పని చేస్తున్నామని కేసీఆర్, అధికార పార్టీ చెబుతున్నప్పటికీ.. అది ఎక్కడా కనిపించడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయకుండా దళితులను ఘోరంగా మోసం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. దివంగత నే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెడితే, సీఎం కేసీఆర్ ఆ పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి కమీషన్ల కోసం రీడిజైన్ చేశారని అన్నారు.

దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ ? 
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు అని చెప్పిన సీఎం కేసీఆర్, ఆ హామీలన్నింటిని తుంగలో తొక్కారని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల దళిత కుటుంబాలు ఉంటే కనీసం వారిలో 10 శాతం మందికి కూడా దళిత బంధు ఇవ్వలేదని చెప్పారు. ఇలా ప్రతీ ఒక్క విషయంలో దళితులను మోసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్ల వచ్చిందని... రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్ కు కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఎంత అని ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహం పెడతామని విస్మరించారన్నారు. ఒకటి కాదు రెండు కాదు దళితులను తక్కువగా చూడటం కేసీఆర్ నైజం అని వివరించారు. దళితులు కేసీఆర్ కు ఓటు బ్యాంకుగా పనికొస్తారే తప్ప కనీసం పక్కన కూడా పెట్టుకోరని షర్మిల మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ కామెంట్లు చేస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ని ఘోరంగా అవమానించారన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నామన్నారు. మీరు రుణమాఫీ చేయడానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అడ్డొచ్చిందా అంటూ విమర్శించారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా అని కామెంట్లు చేశారు. కేసీఆర్ ఏ విషయంలో రాజ్యాంగాన్ని మారుస్తానన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి నిలబెట్టుకోవడం చేతకాలేదు కానీ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చారన్నారు. రాజ్యాంగం అనేది మన దేశాన్ని నడిపిస్తున్న ఇంధనం అని.. రాజ్యాంగం అన్నది మన దేశానికే మహా గ్రంథం అని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలనడం మహా ఘోరం అని షర్మిల ఫైర్ అయ్యారు.

కొట్టి చంపే రాజ్యాంగమే.. కేసీఆర్ రాజ్యాంగం

తెలంగాణలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని... తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. కే అంటే కొట్టి, సీ అంటే చంపి, ఆర్ అంటే రాజ్యాంగం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ భారత దేశంలో అంతా అంబేడ్కర్ గారి రాజ్యాగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో మనకు హక్కులున్నాయి, స్వేచ్ఛ ఉంది కానీ... , ప్రజల కోసం నిలబడి మాట్లాడే హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉందని తెలిపారు. కానీ కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, ప్రజల కోసం ఎవరైనా పోరాడితే వాళ్లను కాలు బయట పెట్టనివ్వకూడదు అని రాసి ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget