Konda Surekha Health:సచివాలయంలో కళ్లు తిరిగిపడిపోయిన మంత్రి కొండా సురేఖ
Konda Surekha Health: లోబీపీ కారణంగా మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియెట్‌లోనే స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.

Konda Surekha Health:తెలంగాణ మంత్రి కొండ సురేఖ సెక్రటేరియట్‌లో కళ్లు తిరిగి పడిపోయారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రాథమిక చికిత్స చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గంటూ వచ్చారు. తీరికలేక వరస కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు చెప్పారు.
హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద మంత్రి కొండా సురేఖ సొమ్మసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు వైద్యులను రప్పించి పరీక్షలు చేయించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రమాదం లేదని చెప్పారు. ఉదయం నుంచి ఏం తినకపోవడంతో లోబీపీ వచ్చిందని వెల్లడించారు. ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మంత్రివర్గ సమావేశానికి వెళ్లిపోయారు.
అంతకు ముందు పీసీబీ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. పర్యావరణంపై అవగాహన పెంచుకొని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అన్నారు.
You can’t drink plastic.
— Konda Surekha (@iamkondasurekha) June 5, 2025
You can’t breathe smoke.
You can’t eat concrete.
You can’t live without nature.
This World Environment Day, let’s remember what really sustains us.#WorldEnviornmentDay #SayNoToPlastic pic.twitter.com/wl5h5ebtpx
చెట్లను పెంచి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించ్చి... మన ఆరోగ్యమే కాదు, మన భవిష్యత్ తరాల సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం!! pic.twitter.com/AcY5qWlyaM
— Konda Surekha (@iamkondasurekha) June 5, 2025





















