అన్వేషించండి

Telangana Jagruthi: తెలంగాణ జాగృతికి పలు దేశాల్లో అధ్యక్షులను నియమించిన కల్వకుంట్ల కవిత

BRS MLC Kavitha | తెలంగాణ జాగృతికి పలు దేశాల్లో అధ్యక్షులను నియమించారు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పలు పార్టీల నేతలను, ఉద్యమనేతలతో వరుస భేటీలు అవుతున్నారు.

Kavitha Politics | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని మరింత యాక్టివ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సైలెంట్ మూమెంట్ మొదలుపెట్టి, క్రమంగా పలు పార్టీల నేతల్ని కలిసి మద్దతు కూడగుతున్నారు కవిత. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంస్థ తెలంగాణ జాగృతికి విదేశాల్లో అధ్యక్షులను ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాలవారికి చేరువ కావడానికి తెలంగాణ జాగృతి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే విదేశాల్లోనూ తమ శాఖలను పటిష్టం చేసే పనిలో కవిత బిజీగా ఉన్నారు. పలు దేశాలలోని శాఖలతో ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు దేశాల తెలంగాణ జాగృతి శాఖలకు నూతన అధ్యక్షులను ఆదివారం (జూన్ 29న) ప్రకటించారు. బాధ్యతలు అప్పగించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాలలో ఉన్న తెలంగాణ వాసుల సంక్షేమానికి కృషి చేయాలని ఆమె సూచించారు. అలాగే మహారాష్ట్ర శాఖ అధ్యక్షులుగా శ్రీనివాస్ సుల్గేను ఎమ్మెల్సీ కవిత నియమించారు. తాజా నియామకాలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని, త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి ఓ ప్రకటనలో తెలిపారు.  

వివిధ దేశాల అధ్యక్షులు, ఇతర నియామకాలు :
- న్యూజిలాండ్ అధ్యక్షులు - అరుణ జ్యోతి ముద్దం
- గల్ఫ్ అధ్యక్షులు :  చెల్లంశెట్టి హరిప్రసాద్
- ఖతర్ అధ్యక్షులు -  మూకల ప్రవీణలక్ష్మి,   -      అడ్వైజర్ - నందిని అబ్బగోని 
- యూఎఈ అధ్యక్షులు - పీచర వేంకటేశ్వర రావు,  -       ప్రధాన కార్యదర్శి: శేఖర్ గౌడ్  
- కువైట్ అధ్యక్షులు - మర్క ప్రమోద్ కుమార్
- సౌదీ అరేబియా అధ్యక్షులు - మహమ్మద్ మొజ్జం అలీ ఇఫ్తెకార్ 
- ఒమన్ అధ్యక్షులు - గుండు రాజేందర్ నేత
- యునైటెడ్ కింగ్ డమ్‌ అధ్యక్షులు - సుమన్ రావు బల్మూరి
- ఇటలీ అధ్యక్షులు - తానింకి కిశోర్ యాదవ్
- ఫిన్లాండ్ - ఐరెడ్డి సందీప్ రెడ్డి 
- పోర్చుగల్ - ప్రకాశ్ పొన్నకంటి 
- మాల్టా అధ్యక్షులు - పింటు ఘోష్ 
- కెన్యా అధ్యక్షులు - స్వప్న రెడ్డి గంట్ల
- ఇరాక్ & కుర్దిస్తాన్ - అధ్యక్షులు: మహ్మద్ సల్మాన్ ఖాన్,  - ప్రధాన కార్యదర్శి నాయక్వార్ రాం చందర్

తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో సమీకరణాలు మారిపోయాయి. తన తండ్రిని నేరుగా కలవలేకపోయానని సైతం ఓసారి చెప్పిన కవిత.. తన తండ్రి కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పడం పార్టీలో ప్రకంపనలు రేపింది. దీనిపై మాట్లాడటానికి కేటీఆర్, హరీష్ రావు అంతగా ఇష్టపడలేదు. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేద్దామని చూడగా అడ్డుకున్నది తానేనని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యల్లో మాత్రం నిజం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేది లేదని కేటీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget