IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

GO 69: 84 గ్రామాలకు 69తో విముక్తి- సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 84 గ్రామాలను విముక్తి చేసేందుకు 69 జీవో తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయిన చర్యను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చింది.

FOLLOW US: 

111 నెంబర్‌ జీవోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ జీవో కారణంగా అమల్లో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ మరో జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. 69 నెంబర్‌ జీవో జారీ చేసి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో జంట జలాశయాల పరిధిలో నిర్మాణాలకు ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. సుమారు 84 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. 

కొత్తగా తీసుకున్న నిర్ణయం వల్ల జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేస్తారు. ఈ కమిటీ ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రీన్‌ జోన్లను ఏర్పాటు చేస్తుందీ కమిటీ దీని వల్ల జలాశయాలకు ఎలాంటి హాని జరగకుండా చూస్తుంది. 
 
అంతే కాకుండా ఎస్టీపీలు ఏర్పాటు చేసి జలాశయాలకు ఎలాంటి హాని జరగకుండా చూస్తుందీ సీఎస్‌ కమిటీ. ఎస్టీపీల నుంచి వచ్చే వ్యర్థాలు జలశాయాల్లో కలవకుండా జాగ్రత్త పడతారు. కలుషితం కాకుండా చూస్తారు. ఈ మురుగు నీరు జలాశయాల్లోకి వెళ్లకుండా ప్రత్యేక టాక్స్ లైన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. 

అసలేంటీ జీవో 111

హైదరాబాద్‌ శివారులో గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాలు ఉన్నాయి.  వీటిని జంట జలాశయాలు అంటారు. వీటి పరిరక్షణకు తీసుకొచ్చిందే ఈ జీవో 111. ఈ జీవో ప్రకారం ఈ జలాశయాల పరిధిలోని పది కిలోమీటర్ల వరకు కాలుష్యకారక ఫ్యాక్టరీలు, హోటళ్లు, కాలనీలు నిర్మించడానికి వీల్లేదు. 

జంట జలాశయాల పరిరక్షణ కోసం 1994లో 192 నెంబర్‌ జీవో తీసుకొచ్చారు. అందులో కొన్ని లోపాలు సవరించి 1996 మార్చి 8న మరో జీవో తీసుకొచ్చారు. అదే 111 నెంబర్ జీవో. దీని ప్రకారం క్యాచ్‌మెంట్‌ పరిధిలో వేసే లే అవుట్లలో 60 శాతం ఓపెన్ ప్లేస్‌ ఉంచాలి. రోడ్ కోసం ప్రత్యేకంగా స్థలం విడిచి పెట్టాలి. వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేష్ కోసం కేటాయించాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల నియంత్రణకు ప్రత్యేక ఏజెన్సీతో ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఉండాలి. ఈ జీవో అమలులో ఉన్న ప్రాంతంలో జీ ప్లస్‌ టు మించి నిర్మాణాలు చేయడం నిషేధం. 

ఈ జీవో పరిధిలోకి ఎనిమిది మండలాలు వస్తాయి. అవి మొయినాబాద్‌, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్‌ ఈ జీవో పరిధిలోకి వచ్చే మండలాలు. ఇప్పడు ఈ జీవో రద్దుతో ఈ మండలాల్లోని 84 గ్రామాలకు ఊరట లభించనుంది. 

Published at : 20 Apr 2022 08:47 PM (IST) Tags: Telangana Government GO Number 111 GO Number 69 84 villages

సంబంధిత కథనాలు

Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ