Telangana Elections 2023: హైదరాబాద్ లో అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించేది ఎక్కడంటే! పూర్తి వివరాలిలా
Telangana Elections 2023: హైదరాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నియమించిన ఆర్.ఓ ల వివరాలను జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
Returning officers for 15 Assembly segments in Hyderabad
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 3న సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే రోజు (శుక్రవారం) ఉదయం నుంచి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల (ఆర్‌వో) కార్యాలయాలను సిద్ధం చేశారు. నవంబర్ 3వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నియమించిన ఆర్.ఓ లు నామినేషన్లు స్వీకరిస్తారు అని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. నవంబర్ 5 ఆదివారం సెలవు కావడంతో ఆరోజు అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకోరు.
హైదరాబాద్ లో నామినేషన్లను స్వీకరించే కార్యాలయాల అడ్రస్ వివరాలు ఇలా ఉన్నాయి..
1. ముషీరాబాద్ నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మినారాయణ (95501 47479) ను ఆర్.ఓ గా నియమించారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని ముషీరాబాద్ మండల తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. ముషీరాబాద్ ఎమ్మార్వో వెంకటలక్ష్మి (94408 15881) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
2. మలక్ పేట్ నియోజకవర్గానికి హైదరాబాద్ కలెక్టరేట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకట ఉపేందర్ రెడ్డి (9951865584) ను ఆర్.ఓ గా నియమించారు. నల్గొండ క్రాస్ రోడ్ లోని మలక్ పేట్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు.. సైదాబాద్ ఎమ్మార్వోగా చేస్తున్న జయశ్రీ (9440815883) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
3. అంబర్ పేట్ నియోజకవర్గానికి హైదరాబాద్ కలెక్టరేట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అపర్ణ (9618877044) ను ఆర్.ఓ గా నియమించారు. అంబర్ పేట్ తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. అంబర్ పేట్ ఎమ్మార్వోగా పనిచేస్తున్న బిక్షపతి (9440815871) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
4. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న వెంకటేష్ దొత్రె (7842452571) ను ఆర్.ఓ గా నియమించారు. ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. షేక్ పేట్ ఎమ్మార్వోగా పనిచేస్తున్న అనితారెడ్డి ని ఏ.ఆర్.ఓ గా నియమించారు.
5. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ఆర్.డి.ఓ గా పనిచేస్తున్న టి.రవి (9440815891) ను ఆర్.ఓ గా నియమించారు. జూబ్లీహిల్స్ లోని షేక్ పేట్ తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. ఖైరతాబాద్ ఎమ్మార్వోగా పనిచేస్తున్న మొహమ్మద్ నయీమ్ ఉద్దీన్ (9440815879) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
6. సనత్ నగర్ నియోజకవర్గానికి హెచ్.ఎం.డి.ఏ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి.కిషన్ రావు (7337055563) ను ఆర్.ఓ గా నియమించారు. సికింద్రాబాద్ జోనల్ ఆఫీసు మూడవ అంతస్తులో మారేడ్ పల్లి సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ లో నామినేషన్లను స్వీకరిస్తారు. బేగంపేట్ డిప్యూటీ కమిషనర్ శంకర్ (9154295263) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
7. నాంపల్లి నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న లావణ్య (9440815892) ను ఆర్.ఓ గా నియమించారు. ఆసీఫ్ నగర్ తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు.. ఆసీఫ్ నగర్ తహశీల్దార్ గా పనిచేస్తున్న ఎస్.జ్యోతి (9440815873) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
8. కార్వాన్ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కొమురయ్య (9440815892/ 9182926955) ను ఆర్.ఓ గా నియమించారు. లంగర్ హౌస్ లోని గోల్కొండ ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. గోల్కొండ తహశీల్దార్ గా పనిచేస్తున్న అహల్య (9985199770) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
9. గోషామహల్ నియోజకవర్గానికి హెచ్.ఎం.డి.ఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.విక్టర్ (9866679319) ను ఆర్.ఓ గా నియమించారు. ఆబిడ్స్ జీహెచ్ఎంసీ పార్కింగ్ కాంప్లెక్స్ నాలుగో అంతస్తులో నామినేషన్లను స్వీకరిస్తారు. నాంపల్లి ఎమ్మార్వోగా పనిచేస్తున్న ఎం.ప్రేమ్ కుమార్ (9440815882) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
10. చార్మినార్ నియోజకవర్గానికి చార్మినార్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న టి.వెంకన్న (9618249933) ను ఆర్.ఓ గా నియమించారు. మొఘల్ పుర జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో నామినేషన్లను స్వీకరిస్తారు. చార్మినార్ ఎమ్మార్వోగా పనిచేస్తున్న నిహారిక (9440815876) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
11. చాంద్రాయణ గుట్ట నియోజకవర్గానికి హైదరాబాద్ ఆర్.డి.ఓ గా పనిచేస్తున్న ఎం.సూర్యప్రకాశ్ (9440815890)ను ఆర్.ఓ గా నియమించారు. ఇంజన్ బౌలి ఫలక్ నూమా పోలీస్ స్టేషన్ పక్కన చాంద్రాయణ గుట్ట తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. బండ్లగూడ మండలం ఎమ్మార్వో జయమ్మ (9550815875)ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
12. యాకత్ పుర నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఇ.వెంకటచారి (9948168481) ను ఆర్.ఓ గా నియమించారు. చంపాపేట్ తహశీల్దార్ ఆఫీసు, సైదాబాద్ నామినేషన్లను స్వీకరిస్తారు.. హైదరాబాద్ ఆర్.డి.ఓ గా పనిచేస్తున్న కృష్ణ కుమార్ (9440815854) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
13.బహదూర్ పుర నియోజకవర్గానికి హైదరాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న దశరత్ సింగ్ (9948168481) ను ఆర్.ఓ గా నియమించారు. బహదూర్ పుర తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. బహదూర్ పుర ఎమ్మార్వోగా పనిచేస్తున్న చంద్రశేఖర్ గౌడ్ (9440815874) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
14. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ డిప్యూటీ కలెక్టర్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఎస్.ఎల్లారెడ్డి (9989229215) ను ఆర్.ఓ గా నియమించారు. సికింద్రాబాద్ జోనల్ ఆఫీసు, సిటీ సివిల్ కోర్టు ఎస్టేట్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. సికింద్రాబాద్ ఎమ్మార్వోగా పనిచేస్తున్న పాండు నాయక్ (9440815884)ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.
15. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీ.ఈ.ఓ మధుకర్ నాయక్ 7288066777) ను ఆర్.ఓ గా నియమించారు. సికింద్రాబాద్ ఎస్.పి రోడ్ కోర్టు హౌస్ కాంపౌండ్ కంటోన్మెంట్ బోర్డు ఆఫీసు లో నామినేషన్లను స్వీకరిస్తారు. తార్నాకలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.ఎస్.పి గా పనిచేస్తున్న వసంత కుమార్ (9381806137) ను ఏ.ఆర్.ఓ గా నియమించారు.