News
News
X

కేసీఆర్‌కు ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్‌!

ఘనంగా కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు

మొదటి నుంచీ డేరింగ్‌ స్టెప్స్ కేసీఆర్ నైజం

అదే స్టైల్‌తో జాతీయ రాజకీయాల్లోకి

FOLLOW US: 
Share:

తెలంగాణ సీఎం కేసీఆర్‌ 69 ఏళ్లు పూర్తి చేసుకొని 70 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆయనకు ఇది చాలా కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఓ సామాన్య ఫ్యామిలీలో పుట్టిన కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించి నేషనల్‌ ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో అద్భుత విజయలు సాధించిన ప్రజానేతగా తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారాన్ని  సాధించారు. తనే ముందుండి అందర్నీ గెలిపించి మరింత మందికి ఆదర్శంగా నిలించారు. అంతే కాకుండా పదేళ్ల పాలనలో ఎన్నో గతంలో ఎప్పుడూ ఎవరూ ఊహించని పథకాలను ప్రజలకు అందించి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్ళమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పేరును మారుమోగిలా చేశారు. 
తెలంగాణ రోల్‌ మోడల్‌గా చూపిస్తూ జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితీని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చాలా మంది కీలక వ్యక్తులు పార్టీ పట్ల ఆకర్షితులై కేసీఆర్‌తో సమావేశమై కారు ఎక్కుతున్నారు. 

రైతు అజెండాతో దేశ రాజకీయాలను మార్చేస్తానంటూ ముందుకు సాగుతున్న కేసీఆర్‌కు ఈ పుట్టిన రోజు చాలా ముఖ్యం. తెలంగాణలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కేసీఆర్ విజయం సాధిస్తే దక్షిణ భారతదేశంలో తొలి ప్రయత్నంలోనే మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి నేతగా రికార్డు సృష్టించనున్నారు.  ఆయన 70వ సంవత్సరంలో సాధించిన అద్భుతమైన విజయంగా చెప్పవచ్చు. మరోవైపు కర్ణాట లాంటి రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో కొన్ని సీట్లైనా గెలుచుకుంటే మాత్రం ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టే అని చెప్పవచ్చు. 

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని వివిద రాష్ట్రాల్లో బలోపేతానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.  అందుకే ఆయన వచ్చే పుట్టిన రోజు నాటికి ఎన్నికలు దగ్గర పడతాయి. ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. అందుకే వచ్చే పుట్టిన రోజు నాటికి బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసి జాతీయ రాజకీయాల్లో సత్తా చేటేందుకు 2023 చాలా కీలకమైనదిగా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈ పుట్టిన రోజులు కేసీఆర్‌కు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. 

1985లో తెలుగుదేశం పార్టీలో చేరిన కె.చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1987 నుంచి 88 వరకు ఆంధ్రప్రదేశ్ సహాయ మంత్రిగా పనిచేశారు. 1992 నుంచి 93 వరకు పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 1997 నుంచి 99 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2001 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీని వీడారు.

ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌తో టీఆర్‌ఎస్‌ను స్థాపించిన నుంచి కేసీఆర్‌ వేసిన ప్రతి అడుగూ ఓ సంచలనంగా మారింది. ప్రత్యర్థులకు అంతుబట్టని వ్యూహాలతో ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని ఉనికిలో ఉంచుతూ వచ్చారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. 2004 నుంచి 06 వరకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేశారు. 2006లో పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు.

2008లో తన ముగ్గురు ఎంపీలు, 3 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యారు. 16 జూన్ వరకు ఆయన యుపిఎ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పట్ల యుపిఎ వ్యతిరేక వైఖరి కారణంగా యుపిఎను వీడటం సముచితమని ఆయన భావించారు.

తర్వాత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి చావు అంచుల వరకు వెళ్లారు. కేసీఆర్ దీక్షతో దిగొచ్చిన కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కోసం ప్రక్రియ చేపడుతున్నట్టు వెల్లడించింది. తర్వాత జరిగిన పరిణామాలతో ప్రక్రియ మరికొన్నేళ్లు ఆగింది. చివరకు  2 జూన్ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. తర్వాత ఎన్నికల్లో అద్భుత విజయం సాదించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Published at : 17 Feb 2023 09:07 AM (IST) Tags: KCR Birth Day BRS Telangana KCR KCR Age

సంబంధిత కథనాలు

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్- విచారణ 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్- విచారణ 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

టాప్ స్టోరీస్

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !