By: ABP Desam | Updated at : 21 Mar 2022 04:13 PM (IST)
టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్
టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 30 నియోజకవర్గాల్లో ఒక స్థానం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీజేపీకి మతపిచ్చి పట్టుకుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంటలు కొనేలా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరమన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళన చేపడుతామన్నారు. తెలంగాణపై కేంద్రం పక్షపాతం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం. pic.twitter.com/iM8DCN7amW
— TRS Party (@trspartyonline) March 21, 2022
24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
కేంద్రంలో అధికారంలో బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. రైతు వేసే ప్రతి గింజకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని కోరారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సబ్ కమిటీ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
కశ్మీర్ ఫైల్స్ పై విమర్శలు
టీఆర్‌ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో సీఎం కేసిఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరింతగా ఉద్యమించాల్సిన టైం వచ్చిందన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కశ్మీర్ ఫైల్స్ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలపై చర్చించాలన్నారు సీఎం కేసీఆర్. అంతేకానీ కశ్మీర్ ఫైల్స్‌పై కాదని అభిప్రాయపడ్డారు. రైతు వేసే పంటలన్నిటికి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు కేసీఆర్. దీని కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు నేతలకు వెల్లడించారు.
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్
MLC Kavitha: కేరళ నుంచి మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్‌కు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు