T SAFE App Launch: ఉమెన్ సేఫ్టీ కోసం టీ-సేప్ యాప్ - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: తెలంగాణ సచివాలయంలో టీ సేఫ్ యాప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, డీజీపీ సహా అధికారులు పాల్గొన్నారు.
Revanth Reddy launched T SAFE App: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీ సేఫ్ (T SAFE) అనే యాప్ ను ఆవిష్కరించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్‌ను రూపొందించినట్లుగా సీఎం చెప్పారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు ఇది అనుకూలంగా ఉంటుందని.. ఈ యాప్ ద్వారా మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తూ ఉండవచ్చని సీఎం చెప్పారు. తెలంగాణ సచివాలయంలో ఈ యాప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, డీజీపీ సహా అధికారులు పాల్గొన్నారు.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం
అంతకుముందు రేవంత్ రెడ్డి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్నారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి మంగళవారం (మార్చి 12) వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ సచివాలయం నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి సహా పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.