Revanth Reddy Canvoy: ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తే ట్రాఫిక్ ఆపొద్దు - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Revanth Reddy News: తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు రేవంత్ సూచించారు.

CM Revanth Rreddy Latest News: ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలను రోడ్డుపై నిలిపేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని అన్నారు. తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు రేవంత్ సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదని అన్నారు. అయితే, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు సీఎం సూచనలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

