Sunitha Laxamarddy: సాంకేతిక రంగంలో రాణించేలా తల్లిదండ్రులు అమ్మాయిలను ప్రోత్సహించాలి- సునీతా లక్ష్మారెడ్డి
సైన్స్ రంగంలో మహిళ పాత్ర తక్కువగా ఉందని, ఆ రంగాల్లో తగిన పాత్ర పోషించేలా అమ్మాయిలను పోత్సహించాలని సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
Sunitha Laxamarddy: మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిలకు ప్రోత్సాహాన్నిచ్చి సాంకేతిక రంగంలో తగిన పాత్రను పోషించే విధంగా చూడాలని తల్లిదండ్రులకు తెలంగాణ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో విజ్ఞాన దర్శిని, మహిళ కమిషన్ ఆధ్వర్యంలో "సాంకేతిక రంగంలో మహిళల పాత్ర" (విమెన్ ఇన్ సైన్స్) పేరిట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సైన్సులో మహిళల శాతం చాలా తక్కువగా ఉన్నదని తెలిపారు. అమ్మాయిలను ప్రోత్సహించాలానే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తరపున విజ్ఞాన దర్శిని అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ రోజు సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో @SCWTelangana మరియు విజ్ఞాన దర్శిని ఎన్జీఓ సారథ్యంలో నిర్వహించిన "విమెన్ ఇన్ సైన్స్" కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై ఫోటో ఎక్సిబిషన్ ను ప్రారంభించి అనంతరం సెమినార్ లో ప్రసంగించడం జరిగింది. @WCDTelangana pic.twitter.com/KgltXgwk9p
— Vakiti Sunitha Laxma Reddy (@sunitavakiti) November 28, 2022
ఇందులో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న ఆమ్మాయిలకు ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. అమ్మాయిలు కూడా తమ తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారో అన్న విషయాన్ని మరచిపోకుండా తమ చదువు సంధ్యలతోపాటు తమ ఎదుగుదల కోసమే చూడాలని సూచించారు. ఆకర్షణలకు లోనై తమ బంగారు జీవితాన్ని, తమ తల్లిదండ్రుల కష్టాన్ని నిర్వీర్యం చేయవద్దని హెచ్చరించారు.
ఈ రోజు ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. pic.twitter.com/GA5VIryR0l
— Vakiti Sunitha Laxma Reddy (@sunitavakiti) November 27, 2022
అంతకు ముందు అంటే ఈరోజు వేకువ జామునే ఏడు పాయల శ్రీ వన దుర్గా భవాని మాతను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి పూజలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకులతో వేదాశీర్వచనం అందించారు.