Sneha Group: కేరళ విషాదం: సీఎం రిలీఫ్ ఫండ్‌కు స్నేహ గ్రూప్ రూ.25 లక్షల విరాళం
Kerala Floods: కొండచరియలు విరిగిపడిన ఘటన కారణంగా స్నేహ గ్రూప్ కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చింది. మేనేజింగ్ డైరెక్టర్ ఈ విరాళాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ కు అందించారు.
Sneha Group News: స్నేహ గ్రూప్ కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చింది. కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి రామ్ రెడ్డి తమ స్నేహ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ కు అందించారు. జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలో ఘోరమైన నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆచూకీ తెలియని శవాలు ఎన్నో ఉన్నాయి.
కొండచరియలు విరిగిపడడం వల్ల మానవ జీవితంపై అత్యధిక ప్రభావం పడడమే కాక, ఈ ప్రాంతంలోని 310 హెక్టార్ల వ్యవసాయ భూములు నాశనమయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వయనాడ్‌లో కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసమై, జనజీవనం స్తంభించిపోవడంతో సహాయం అవసరం గతంలో కంటే ఎక్కువగా ఉంది. అయితే, వీరికి స్నేహ గ్రూప్ తన వంతు ఆర్థిక సాయం చేసింది.
స్నేహ గ్రూప్, భారతీయ పౌల్ట్రీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆర్థిక సాయం చేసింది. 1982లో స్థాపించిన స్నేహ గ్రూప్ పౌల్ట్రీ పరిశ్రమలో చాలా రంగాలలో నాణ్యత, నమ్మకానికి చిహ్నంగా ఎదిగింది. కేరళలలో ప్రస్తుతం పరిస్థితి కారణంగా స్నేహ ఫౌండేషన్ బాధిత కుటుంబాలకు సంఘీభావంగా, సహాయక చర్యలకు తన వంతు సాయం చేసింది. అలాగే ఎవరైనా సహకరించాలని ప్రజలను కోరింది.