By: ABP Desam | Updated at : 15 Jan 2023 06:15 AM (IST)
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
తెలుగు రాష్ట్రాల మధ్యన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి (జనవరి 15) ప్రారంభం కానుంది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే, దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకొచ్చాయి. సోమవారం (జనవరి 16) నుంచి జరిగే ప్రయాణానికి గానూ ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ కేటగిరీల్లో రెండు రకాలు చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ అనేవి ఉన్నాయి. అయితే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు టికెట్ ధర ఎంత ఉందో.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర అంతే లేదు. చైర్ కార్, ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్ టికెట్ రేటు రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ రేటు రూ.3,170గా ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే సర్వీసులో విశాఖపట్నానికి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120గా పేర్కొన్నారు. ఈ టికెట్ రేట్లలో కొంచెం తేడా ఉంది. సాధారణంగా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. అయినా అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్ ధరలు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. అయితే, మొత్తం టికెట్ ధరలో కలిసిపోయి ఉన్న కేటరింగ్‌కు సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉండడంతో ఈ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఛైర్‌కారును టికెట్ ధర విడివిడిగా ఇలా..
* బేస్ ఫేర్ రూ.1,207
* రిజర్వేషన్ ఛార్జీ రూ.40
* సూపర్ ఫాస్ట్ ఛార్జీ రూ.45
* మొత్తం జీఎస్టీ రూ.65
* రైల్లో ఇచ్చే ఫుడ్‌కి రూ.308
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు ఛైర్‌కారును టికెట్ ధర విడివిడిగా ఇలా..
* బేస్ ఛార్జీని రూ.1206
* కేటరింగ్ ఛార్జీ రూ.364 (ఇక్కడే టికెట్ ధరలో రూ.60 తేడా)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్ నడుస్తున్న షెడ్యూల్‌ను బట్టి అందించే ఫుడ్‌లో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు ఉదయం ఇచ్చే ఫుడ్ వేరు. రాత్రి ఇచ్చే ఆహారం వేరు. అందుకే టికెట్ ధరల్లో తేడా కనిపిస్తోంది.
* సికింద్రాబాద్ - విశాఖపట్నం (SC - VSKP) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20834
నుండి వరకు ఛార్జీ (చైర్ కార్) ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
సికింద్రాబాద్ వరంగల్ రూ.520 రూ.1,005
సికింద్రాబాద్ ఖమ్మం రూ.750 రూ.1,460
సికింద్రాబాద్ విజయవాడ రూ.905 రూ.1,775
సికింద్రాబాద్ రాజమహేంద్రవరం రూ.1365 రూ.2,485
సికింద్రాబాద్ విశాఖపట్నం రూ.1665 రూ.3,120
* విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ (VSKP - SC) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833
నుండి వరకు ఛార్జీ (చైర్ కార్) ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
విశాఖపట్నం రాజమహేంద్రవరం రూ.625 రూ.1,215
విశాఖపట్నం విజయవాడ రూ.960 రూ.1,825
విశాఖపట్నం ఖమ్మం రూ.1,115 రూ.2,130
విశాఖపట్నం వరంగల్ రూ.1,310 రూ.2,540
విశాఖపట్నం సికింద్రాబాద్ రూ.1720 రూ.3,170
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
BRS Parliamentary Party Meet : దేశ ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు, పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయండి - సీఎం కేసీఆర్
Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!