అన్వేషించండి

Osmania Hospital: గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్, రేవంత్ రెడ్డి నిర్ణయం

Osmania Hospital New Buildng: కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని 32 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్లు రూపొందిస్తున్నారు.

Revanth Reddy Review: హైదరాబాద్ లోని  గోషామహల్ లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చెప్పారు. గోషా మహల్ లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు దాదాపు 32 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం పోలీస్ విభాగం అధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

రేవంత్ రెడ్డి రివ్యూ

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను ముఖ్యమంత్రి చర్చించారు.   

50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా

రాబోయే 50 ఏళ్ల అవసరాలను అంచనా వేసుకొని, కొత్త ఆసుపత్రి నిర్మాణ డిజైన్లు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూరా నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలని ఆదేశించారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు.  కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు కాకుండా ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండేలా డిజైన్లు ఉండాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి అనుభవజ్ఙులైన ఆర్కిటెక్ట్స్ లతో డిజైన్ లను తయారు చేయించాలని అన్నారు. 

ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే  బాధ్యతను చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. 

గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్ల బుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇప్పుడు గోషా మహల్ లో ఉన్న పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అక్కడికి తరలించేలా చూడాలని చెప్పారు.  

రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని, 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు వీలుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలను ప్రారంభించాలని, తాత్కాలికంగా అద్దె భవనాల్లో వీటిని నిర్వహించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే పది జిల్లాల్లో సమాఖ్య భవనాలున్నాయని, మిగతా 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఒక్కో జిల్లాలో సమాఖ్య భవనాలకు ఒక ఎకరం స్థలం కేటాయించేందుకు అంగీకరించారు. ముందుగా స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లోని  శిల్పారామం పక్కనే మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని వెంటనే ఆ విభాగానికి బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. మహిళా శక్తి సంఘాలు తయారు చేసే తమ ఉత్పత్తులతో అక్కడ ఏడాది పొడవునా వివిధ స్టాళ్లు నిర్వహించేలా భారీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రపంచ స్థాయి అతిథులు, వివిధ రంగాల ప్రముఖులు,   జాతీయ స్థాయి నేతలు ఎవరు హైదరాబాద్ కు వచ్చినా తప్పకుండా సందర్శించే స్థలంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.  ఏడాది పొడవునా నిర్వహించే ఎగ్జిబిషన్ లా వివిధ రకాల ఉత్పత్తులు అక్కడ అందరికీ అందుబాటులో ఉంచాలని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget