News
News
X

Revanth Reddy: వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా? అక్కడికి రండి.. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను 3 లక్షల ఎకరాలు లాక్కున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

FOLLOW US: 

తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, దళితులకు మూడెకరాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను 3 లక్షల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేశామని రేవంత్ గుర్తు చేశారు. 

‘‘దళిత బస్తీలు, ఆదివాసీ గూడెలకు వెళ్లాం. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటాపై ఇంద్రవెల్లి నుంచి దండుకట్టాం. నిన్న గజ్వేల్ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు విజయవంతం అయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు అద్బుతమైన పోరాటం చేసి విజయవంతం చేశారు. మాకు సంపూర్ణ విశ్వాసం కలిగింది. కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫాంహౌస్‌కు పరిమితం అవుతుందని అనిపించింది. సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురు చూస్తోంది. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేసీఆర్ కుటుంబం మీద విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.’’ అని రేవంత్ విమర్శలు చేశారు.

అమిత్ షా అపాయింట్ మెంట్ కోరా..
‘‘నిర్మల్‌కు వచ్చిన అమిత్ షాకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేద్దామని అపాయింట్‌మెంట్ కోరా. అయితే, వారు సమయం ఇవ్వలేదు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షాకు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఈ అంశాలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాంజీగోండు గుర్తుకురాలేదా? బీజేపీ తప్పుడు చరిత్రను మాట్లాడుతోంది. రాంజీగోండు, కాశిం రిజ్వికి మధ్య వంద సంవత్సరాల తేడా ఉంది. అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనలో గోండు బిడ్డ సోయం బాబురావు ఫోటో పెట్టనేలేదు.

కేటీఆర్.. డ్రగ్స్‌తో తనకేమీ సంబంధం లేదని అంటున్నడు. ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు? కేసు మూసేయమని కోర్టులో ఎక్సైజ్ శాఖ అఫిడవిట్ వేసింది. అలాంటప్పుడు డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నట్లు? ఈడీ ఈ రోజు రానాను పిలించింది. ఆయన్ను మూడేళ్ల క్రితం ఎక్సైజ్ శాఖ ఎందుకు విచారణ చేయలేదు? ఎక్సైజ్ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. డ్రగ్స్ విషయంలో కేంద్ర సంస్థలకు ఎందుకు సహకరించడం లేదు?’’

వైట్ ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా?
‘‘సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు వస్తా.. వైట్ ఛాలెంజ్‌లో భాగంగా వస్తా.. మీరు ఇద్దరూ అక్కడికి రండి. ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నమూనాలు ఇద్దాం. వైట్ ఛాలెంజ్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెల్దాం. యువత పెడధోరణి పట్టకుండా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వలేదు. కేసీఆర్, నరేంద్ర మోదీ మీద కొట్లాడేది కాంగ్రెస్ మాత్రమే. బండి సంజయ్ బడాయి మాటలు బంద్ చెయ్యి.. మీ రిమోట్ కేసీఆర్ చేతిలో ఉంది. కేసీఆర్ రిమోట్ మీద తెలంగాణలో బీజేపీ నడుస్తోంది. కేటీఆర్‌ను ఒక్క మాట అడుగుతున్నా..  వైట్ ఛాలెంజ్ ప్రకటిద్దాం. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా ఛాలెంజ్ విసురుతున్నా. వారిద్దరూ మరో ఇద్దరికి ఛాలెంజ్ విసరండి. రక్త నమూనాలు, వెంట్రుకలు డాక్టర్లకు ఇద్దాం. యువతకు రోల్ మాడల్‌గా నిలవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వలేదు.’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Published at : 18 Sep 2021 06:29 PM (IST) Tags: minister ktr cm kcr revanth reddy Bandi Sanjay Telangana Congress

సంబంధిత కథనాలు

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

VH On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, కేసీఆర్ చేస్తుంది డూప్ ఫైట్ - వీహెచ్

VH On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, కేసీఆర్ చేస్తుంది డూప్ ఫైట్ - వీహెచ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Anasuya: 'గాడ్ ఫాదర్'కి అనసూయ దూరం - ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

Anasuya: 'గాడ్ ఫాదర్'కి అనసూయ దూరం - ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ

అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ