అన్వేషించండి

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. దాదాపు 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడతారు. పూర్తి షెడ్యూల్ గురించి తెలుసుకోండి 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణకు చేరుకున్న ప్రధాని మోదీ, పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
  • సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మల్లాపూర్, కాజీపేటలలో కీలక పనులకు శంకుస్థాపన చేశారు.
  • వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్, సింధూ ఆసుపత్రిని ప్రారంభించారు.
  • బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, గుజరాత్‌కు తిరుగు ప్రయాణం.

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ వస్తున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.  ఈ పర్యటన రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి   కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రధాని రాకకు పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రాధాన్యత కలిగింది. సుమారు 8వేల కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజలకు అందించే లక్ష్యంతో సాగుతుంది. 

ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం ఉంది. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద 2,360 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ స్మార్ట్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇది పారిశ్రామిక రంగంలో తెలంగాణకు కొత్త దిశకు చూపించనుంది. 3175 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడెబెల్లూరు మహాబూబ్‌నగర్ జాతీయ రహదారి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.  611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1243 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులకు ప్రధాని జాతీకి అంకితం చేస్తారు.వరంగల్ జిల్లలో 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ టెక్స్ టైల్ పార్క్ తెలంగాణ చేనేత, వస్త్ర రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి సహయపడుతుంది. 

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదే 

ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం తెలంగాణకు చేరుకోనున్నారు. ఆయన పర్యటన అత్యంత పకడ్బందీగా సాగేలా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. మధ్యాహ్నం 2.50 గంటలకు కర్ణాటక నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. హెలీకాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకొని అక్కడ 8000కోట్ల విలువై వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.10 నిమిషాలకు హైటెక్ సిటీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన సింధూ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లో జామ్‌నగర్‌కు బయల్దేరారు. 

ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.    

Frequently Asked Questions

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఎందుకు చేస్తున్నారు?

ప్రధాని మోడీ తెలంగాణలో రూ. 8వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్నారు. ఈ పర్యటన రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో ఉంది.

ప్రధాని మోడీ ఈ పర్యటనలో ఏ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు?

ప్రధాని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద స్మార్ట్ సిటీ, గూడెబెల్లూరు-మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారి, మల్లాపూర్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని మోడీ ఏ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు?

ప్రధాని మోడీ కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులను జాతీకి అంకితం చేస్తారు. అలాగే, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు, హైటెక్‌సిటీ ప్రాంతంలో సింధూ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఏమిటి?

ప్రధాని ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొని, అనంతరం గుజరాత్‌కు బయల్దేరుతారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget