అన్వేషించండి

Election Code: ఎన్నికలకు తరలుతున్న డబ్బు, మూడు రోజుల్లో అంత డబ్బు దొరికిందా?

Election Code: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన 9వ తేదీ నుంచి హైదరాబాద్‌లో పలు చోట్ల నిర్వహించిన విస్తృత తనిఖీల్లో పోలీసులు పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Election Code: తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని రకాల వాహనాలను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన 9వ తేదీ నుంచి హైదరాబాద్‌లో పలు చోట్ల నిర్వహించిన విస్తృత తనిఖీల్లో పోలీసులు పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు, మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినియోగించే నగదు, లిక్కర్‌, ఇతరత్రా అక్రమ రవాణాను అడ్డుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సీపీ తెలిపారు. నిరంతర గస్తీ, నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిఘాలో భాగంగానే రూ.4.2 కోట్లు విలువ చేసే 7.706 కిలోల బంగారం, 8.77లక్షలు విలువ చేసే వెండి, రూ. 5.1 కోట్ల నగదు, 110 లీటర్ల మద్యం, 23 మొబైల్‌ ఫోన్స్‌, 43 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీసులు, ఫ్లైయింగ్‌ స్కాడ్‌ బృందాలు, టాస్క్‌ఫోర్స్‌, ఇతర విభాగాలతో 24/7 చెక్‌పోస్టుల వద్ద పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సీపీ సూచించారు.

ఎక్కడ? ఎంత దొరికిందంటే?
అత్తాపూర్‌ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద ఏకంగా 50 తులాల బంగారం లభించింది. సరైన వివరాలు లేకపోవడంతో బంగారం సీజ్ చేశారు. మెహిదీపట్నం చౌరస్తాలో బుధవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో టోలీచౌకి నివాసి మిర్జా నిజాముద్దీన్‌ వద్ద రూ. 2.20 లక్షల నగదును హుమాయూన్‌నగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూసాపేట పరిధిలో కూకట్‌పల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీకి చెందిన ద్వారక ప్రసాద్‌(49) వద్ద రూ.3.50 లక్షలు లభించాయి. 

కవాడిగూడ గాంధీనగర్‌ పోలీసులు బుధవారం సాయంత్రం బైబిల్‌ హౌజ్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కియా కారులో తరలిస్తున్న ఒక కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోమలగూడ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడి వద్ద రూ.1.75 లక్షలు లభించాయి. జూబ్లీహిల్స్‌ నీరూస్‌ జంక్షన్‌ వద్ద బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టగా.. కారులో వెళ్తున్న ఓ మహిళ వద్ద రూ.5.50 లక్షలను పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వాటికి సరైన వివరాలు, ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

డబ్బు తీసుకెళ్తున్నారా? అయితే జాగ్రత్త!
తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎవరైనా రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి డబ్బు, బంగారం, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి ఉంటే వాటిని పోలీసులు సీజ్ చేస్తారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్‌ చేసే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోసుకోవడం తప్పనిసరి.  

తెలంగాణకు నాలుగు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. మొత్తం148 చెక్‌పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎవరైనా తమ వెంట పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్తుంటే, అందుకు సంబంధించిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమం. ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే.. రోగి రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు, ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోండి. ఏదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget