అన్వేషించండి

Nirmala Sitaraman: బోర్లకు మీటర్లు ఫిక్స్ చేయలేదు, అందుకే నిధులు కట్ చేశాం - నిర్మలా సీతారామన్

Telangana Election News: నేడు (నవంబర్ 21) హైదరాబాద్ వెంగల్ రావు నగర్ లో మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు.

Nirmala Sitaraman Comments: 2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేదని, అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్..  కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్ కి అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (నవంబర్ 21) హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ లోని ముగ్ధ బాంకెట్ హాల్ లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘వేల కోట్ల పెట్టుబడి పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పనికి రాకుండా పోయింది. కుటుంబ పార్టీ పాలనలోనూ.. నిధులు సద్వినియోగ పరుచుకోవడంలోనూ విఫలమైంది. నవంబర్ 30న జరగబోయే ఎలక్షన్స్ తెలంగాణకు చాలా ముఖ్యమైనవి. ఈ ఎన్నికల ప్రాముఖ్యతను ప్రజలకు తెలపాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయింది. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఎటు పోయింది..? కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా.. భవిష్యత్ లో రాష్ట్రాలపై భారం పడకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.  

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్,  పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా, బీజేపీపై దురదజల్లే ప్రయత్నం చేశారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి.. మళ్లీ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. కుటుంబ పాలనతో నిధులను సరిగ్గా వినియోగించలేని పార్టీ మనకు అవసరమా?’’ అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.

మీటర్లు పెట్టనందుకే డబ్బులు ఇవ్వలేదు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టేందుకు నిరాకరించడం పట్ల నిర్మల సీతారామన్ స్పందించారు. ఆ విషయం నిజమేనని అన్నారు. అందుకే కేంద్రం నుంచి ఇవ్వాల్సిన సొమ్మును తెలంగాణకు ఇవ్వలేదని చెప్పారు. మిగతా రాష్ట్రాలు బోర్లకు మీటర్లు ఫిక్స్ చేసి తమకు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను తీసుకున్నారని అన్నారు.

హరీశ్ రావు కౌంటర్

ఈ వ్యాఖ్యలపై హుస్నాబాద్ లో మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గొంతులో పానం ఉన్నంత కాలం బోరు బాయి కాడ మీటర్ పెట్టా అన్నడని హరీశ్ రావు గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ అసలు ఉన్న విషయాన్ని బయటపెట్టారని అన్నారు. దీంతో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు క్లియర్ గా నిర్మలా సీతారామన్ చెప్పారని చెప్పారు. మోటార్లకు మీటర్లు అని బీజేపీ, మూడు గంటలు కరెంటు అని కాంగ్రెస్ అంటున్నదని.. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget