అన్వేషించండి

నాంపల్లి ఎగ్జిబిషన్ వద్ద అగ్నిప్రమాదం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు మంటలు వ్యాప్తి చెందాయి.

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న ఓ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కార్ లో నుంచి మంటలు మొదలై నిమిషాల్లో వ్యాపించినట్లుగా సమాచారం. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, అబిడ్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అగ్ని ప్రమాదం జరగడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వీకెండ్ కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సందర్శకుల తాకిడి పెరిగింది. పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ ను రోజూ వేల సంఖ్యలో సందర్శిస్తున్నట్లు బుకింగ్ కిమిటీ ఛైర్మన్ హన్మంత్ తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేసినట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్ కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. 

2019లోనూ నుమాయిష్ లో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో స్టాళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించారు.

జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన నుమాయిష్ 
ప్రతీ ఏటా ఎంతో గ్రాండ్ గా నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన ఈ నుమాయిష్.. 46 రోజుల పాటు సందడిగా సాగనుంది. అయితే ఈ ఎగ్జిబిషన్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలి, ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతీ రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకూ ఎగ్జిబిష్ గ్రౌండ్‌లోకి  సందర్మకులను అనుమతిస్తారు. టికెట్ ధరను ఈసారి పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.30 ఉంటే ఈసారి నుంచి 40 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్నం 3 దాటాక ఎగ్జిబిషన్ లోపలకు సందర్మకులను అనుమతిస్తే, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 600 రూపాయలు చెల్లించి నేరుగా కారులో లోపలికి వెళ్లి నుమాయిష్ చుట్టివచ్చే విధంగా ఈసారి అవకాశం కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. 

82వ నుమాయిష్..
ఈ ఏడాది 82వ నుమాయిష్ ను నిర్వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడకు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్ నెట్ కోసం బీఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ కు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది విజిటర్స్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath Bail: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు ఊరట! పోక్సో కేసులో బెయిల్!
Breaking News:పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Rainbow Hospital: ఐదో అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జనమ్మ! క్లిష్టమైన చికిత్స చేసి ప్రాణం పోసిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు! 
ఐదో అంతస్తు నుంచి పడిన బాలుడికి పునర్జనమ్మ! క్లిష్టమైన చికిత్స చేసి ప్రాణం పోసిన రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు! 
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget