అన్వేషించండి

HYDRA News: హైడ్రాకు ఎంపీ మద్దతు - రూ.25 లక్షల నిధులు అందజేత

Hyderabad News: హైదరాబాద్ లోని చెరువులు, నాలాలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి కమిషనర్ ఏవీ రంగనాథ్ ను నియమించారు.

MP Anil Yadav: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా పేరు మార్మోగుతోంది. అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణలను నిర్మూలించడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఒకరు హైడ్రాకు తన వంతుగా విరాళం అందించారు. హైదరాబాద్ లోని బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసిన ఎంపీ అనిల్ యాదవ్ కలిశారు. హైడ్రా పని తీరుపై ఎంపీ అనిల్ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.25 లక్షల రూపాయలను అనిల్ యాదవ్ కేటాయించారు. రూ.25 లక్షలు కేటాయిస్తూ ఆ లేఖను కమిషనర్ రంగనాథ్ కు అనిల్ యాదవ్ అందజేశారు. 

హైదరాబాద్ నగరంలోని చెరువులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి కమిషనర్ గా మంచి అధికారిగా పేరున్న ఏవీ రంగనాథ్ ను నియమించారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘హైడ్రా పని తీరు అభినందిస్తూ.. హైడ్రాకు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలను రంగనాథ్ కు అందజేశాం. పదేళ్లు అధికారంలో అన్న కేసీఆర్ హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దుతాం అన్నారు. కానీ హైదరాబాద్ లోని అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేక పోయారు. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల గురించి అలోచించి.. హైదరాబాద్ అద్భుతమైన నగరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయాల కోసం హైడ్రా అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ అభివృద్ధి కోసం చేస్తున్నారు. అనేక నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బందులు రావద్దు అని ఈ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. పదేళ్ల కింద అనేక చెరువులు నిండు కుండలా ఉండేవి. అక్రమ కట్టడాలు చేపట్టిన వారు ఎవరు అయిన హైడ్రా వదిలిపెట్టదు. అటు డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. హైడ్రాను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలని వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి. జిల్లాలకు కూడా హైడ్రా విస్తరించాలి. హైడ్రాకు మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం’’ అని ఎంపీ అనిల్ యాదవ్ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget