Hyderabad News: ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
మేడ్చల్ జిల్లా గాజులరామారంలో తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా కత్తితో నరికి చంపి, తానూ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలో పలు ఆశక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

కనిపెంచిన బిడ్డలను, కంటికి రెప్పలా కాాపాడుకుంటుంది ఏ తలైనా.. కాలికి చిన్న గాయమైతేనే అయ్యో నా బిడ్డ, ఏం జరిగింది నాన్న అంటూ విలపిస్తుంది. అంతలా తల్లిమనస్సు చలించిపోతుంది. తాజాాగా మేడ్చెల్ జిల్లా గాజులరాామారం లోని సహస్రాస్ మహేష్ హైట్స్ అనే అపార్టెంట్ లో జరిగిన ఘటన అత్యంత హేమమైనది. తల్లి తేజస్విని కసాయిలామారి తన ఇద్దరు కొడుకులైన ఆషిస్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను కత్తితో అత్యంత పాసవికంగా నరికి చంపి, అదే అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఇంతటి దారుణానికి ఆ తల్లి ఎందుకు పాల్పడింది. ఆమె మానసిక పరిస్దితి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబిపి దేశం. ఆ పార్ట్మెంట్ పనిమనిషి , ప్రత్యక్షసాక్షి దుర్గాభవానితో మాట్లడింది. ఘటనపై ఆమె మాటల్లోనే ABP దేశం Exclusive ఇంటర్వూ...
ABP దేశం..
ఆరోజు ఇంట్లో ఏం జరిగింది.. మీకు ఘటన జరిగినట్లు ఎప్పుడు తెలిసింది..?
దుర్గాభవాని, ప్రత్యక్షసాక్షి.. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే పిల్లను ఇంట్లో చంపేసింది. నేను ఆ సమయంలో పైన ఫ్లోెర్ లో పనిచేస్తున్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో వెంటనే క్రిందకు వెళ్లి చూడగా అప్పటికే తేజస్విని పైనుండి దూకి ,రక్తం మడుగులో ప్రాణాలు కోల్పోయింది. వెంటనే పైకి వెళ్లి అపార్ట్మెంట్ లో అందరినీ పిలిచాను. అంతా ఒక్కసారిగా షాక్ అయ్యాము.
ABP దేశం..
ఇద్దరు పిల్లను అత్యంత కిరాతంగా చంపేసింది. ఆమె మానసిక పరిస్దితి ఎలా ఉండేది..?
దుర్గాభవాని, ప్రత్యక్షసాక్షి...
ఆమెకు గత కొంతకాలంగా మానసిక పరిస్దితి బాగోలేదు. ఇంట్లో భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం కదా. అందుకే అలా ఉందని అంతా అనుకునేవాళ్లం. భర్త బాగానే చూసుకునేవాడు. పెద్ద కొడుకు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రతీ నెల ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. ఆమెకు కోపం బాగా ఎక్కువ. ప్రతీ చిన్న విషయానికి విపరీతంగా కోప్పడేది. అందుకే ఎవరూ ఆమెతో అంతగా మాట్లడేవాళ్లు కాదు. ఆమె పలకరిస్తే తప్ప ,ఆమెకు దూరంగా ఉండేవాళ్లం.అప్పుడప్పుడు పెద్దగా అరవడం చేసేది.
ఆ ఇద్దరు పిల్లలు ఏలా ఉండేవాళ్లు.. ఆరోజు పిల్లలను చూసారా మీరు.. ఏం జరిగింది..?
దుర్గాభవాని, ప్రతక్షసాక్షి..
ఘటన జరిగినరోజు పిల్లలను స్కూల్ మాన్పించింది. క్రిందకు దూకి చనిపోయిన ఆమెను చూసిన వెంటనే లోపలకు వెళ్లాము. ఇంట్లో పిల్లను ఆడుకుంటున్నారు అనుకున్నాము.కానీ లోపల రక్తపు మరకలు చూసి, లోపలకు వెళ్లలేకపోయాను. అంత భయంకరంగా పిల్లల రక్తంతో కిచెన్ నిండిపోయింది. పిల్లలతో ఇబ్బంది పడుతున్నట్లు ఎప్పుడూ ఆమె ఎవరికి చెప్పలేదు.పిల్లలను ఆమె స్కూల్ నుండి తీసుకెళ్లి, తీసుకొచ్చేది. ఆపార్ట్మెంట్ క్రిందనే ఆడుకునేవారు.పిల్లలంటే చాాలా ఇష్టం. దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకునేది. సాయంత్రం పిల్లలు ఆడుకోొవడానికి దిగితే ,వాళ్లతోపాటే వచ్చేది. వాళ్లు ఆడుకున్నంతసేపు వాళ్లదగ్గరే ఉండి,తిరిగి ఇంటికి తీసుకెళ్లేది.పిల్లంటే అంతలా ఇష్టం ఆమెకు.
పిల్లలపై ఇంత ప్రేమ ఉన్నతల్లి,దారుణంగా ఎందుకు చంపింది, మీరు ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నారు. ఆమె ఎలా ఉండేది..?
దుర్గాభవాని, ప్రత్యక్షసాక్షి..
మేము గత మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. ఆమెకు ఏదైనా పని ఉండి మాతో మాట్లడితే తప్ప మేము, ఆమెతో మాట్లడేవాళ్లం కాదు. ఆ రోజు రాత్రి ఇంట్లో గొడవలు జరిగినట్లు కూడా వినిపించలేదు. భర్త కూడా మంచి వ్యక్తే. అంతలా ఇబ్బంది పెట్టే మనిషికాదు. ఎందుకిలా జరిగిందనే షాక్ లో ఉన్నాం. ఆమెకు చాలా కోపం ఎక్కువ, ఆమెతో ఎవరూ పెద్దగా మాట్లడేవాళ్లుకాదు. ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాని పరిస్దితి.





















