అన్వేషించండి

KTR: కేటీఆర్ నుంచి ‘పాలమ్మిన, పూలమ్మిన’ మాటలు - మల్లారెడ్డి ముందే ఫన్నీ కామెంట్స్

మంత్రి కేటీఆర్‌ నోటి వెంట కూడా మల్లారెడ్డి వ్యాఖ్యలు సరదాగా వచ్చాయి. అలా కేటీఆర్‌ కూడా కాసేపు నవ్వులు పూయించారు.

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఎంత సరదాగా మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా అది వైరల్ అయిపోతోంది. కొద్ది నెలల క్రితం ఆయన మాట్లాడిన ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్ వెల్స్ నడిపించినా.. చిట్ ఫండ్స్ వేసినా.. కాలేజీలు పెట్టినా’ అని చేసిన వ్యాఖ్యలు విపరీతంగా జనాల్లోకి వెళ్లాయి. యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ లో ఎక్కడ చూసినా మల్లారెడ్డి మాటలే హల్ చల్ చేశాయి. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను వివిధ సందర్భాల్లో పదే పదే మల్లారెడ్డి ప్రస్తావిస్తూ వచ్చారు. దాంతో ఆయనకు మరింత పాపులారిటీ పెరిగిపోయింది.

తాజాగా మంత్రి కేటీఆర్‌ నోటి వెంట కూడా మల్లారెడ్డి వ్యాఖ్యలు సరదాగా వచ్చాయి. అలా కేటీఆర్‌ కూడా కాసేపు నవ్వులు పూయించారు. మేడ్చల్‌ పరిధిలోని జవహర్‌ నగర్‌లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన కలుషిత వ్యర్ధ జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మల్లారెడ్డి ప్రస్తావించారు. ఆయనకు సమాధానమిస్తూ.. ఇటీవల బాగా ట్రెండింగ్‌గా మారిన ‘పాలమ్మిన.. పూలమ్మిన..’ అనే మల్లారెడ్డి డైలాగ్‌ను చెప్పి కేటీఆర్‌ అందరినీ నవ్వించారు. ఆ సమయంలో సభకు వచ్చిన జనాలు అందరూ కేరింతలు కొట్టారు.

‘‘ఇగ నేను మాట్లాడేదేమున్నది? మల్లన్నతో పెట్టుకుంటే గిట్లనే ఉంటది. మా మల్లన్న ఏం చెప్పిండు.. పాలు పిండినా..  అన్నావా లేదా (మల్లారెడ్డి వైపు చూస్తూ) కూరగాయాలు అమ్మినా.. ఇంకేం అమ్మినా అన్నావ్.. పూలు కూడా అమ్మినవ్. ఇంకా గమ్మత్తు ఏందంటే.. మొన్న శంకుస్థాపన దగ్గర జనాలంతా మీద పడుతుంటే మల్లన్న అందర్నీ నూకుతున్నడు. అరే గట్ల ఎందుకే పెద్ద మనిషివి నీకివన్నీ ఎందుకే అని అంటే.. చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేసిన సార్.. గిదేం లెక్కనా అన్నడు’’ అని కేటీఆర్ అనగానే అందరూ పగలబడి ఫక్కున నవ్వేశారు. 

అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డిగారు అన్ని రకాలుగా  ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఆయన కూడా ఒక ఆస్పత్రి కట్టారు కానీ ఎందుకో సరిగ్గా నడవలేదు. మల్లారెడ్డి కార్పొరేట్ సంస్థల నుంచి జవహర్ నగర్‌కు కూడా ఏదో ఒకటి చేయండి మరి’’ అని మల్లారెడ్డిని కేటీఆర్ కోరారు.

కేటీఆర్ స్మార్ట్ మినిస్టర్ - మల్లారెడ్డి

ఇదే సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ వచ్చేది మన పార్టీనే అని అన్నారు. పనులు చేసేది కూడా మన పార్టీనే, ఎవడి దగుల్భాజీ మాటలు, మోసపూరిత మాటలు నమ్మకూడదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పబ్లిక్ సెక్టార్లను అమ్ముతున్నాయి’’ మంత్రి మల్లారెడ్డి నవ్వులు పూయించారు. తన ప్రసంగాన్ని ముగించే ముందు.. డైనమిక్ స్మార్ట్ మినిస్టర్, ప్రపంచంలో ఎక్కడైనా స్మార్ట్ మినిస్టర్ ఉన్నాడా అంటే ఆయనే కేటీఆర్ అని కొనియాడారు. స్మార్ట్ అంటే పనిలో, తెలివి అని అన్నారు. ప్రపంచంలో ఇలాంటి వాళ్లు లేరు కాబట్టే హైదరాబాద్‌ ఈ రేంజ్‌లో అభివృద్ధి చెందుతోందని మల్లారెడ్డి కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget