KTR Review: వర్షాలపై మంత్రి కేటీఆర్ రివ్యూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగొద్దని ఆదేశాలు
భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన వేళ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్ సహా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని నానుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో వరదలు, పారిశుద్ధ్యంపై సమావేశంలో చర్చించారు. ఇంకా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన వేళ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.
ఎలాంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి సహాయక చర్యలు అవసరం వచ్చినా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరదల వల్ల ప్రాణ నష్టం జరగకూడదని ఆదేశించారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను కూడా ఎదుర్కొనడానికి అవసరమైన ఏర్పాట్లతో రెడీగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు మంత్రి కేటీఆర్‌కి తెలిపారు. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారుల్లో ఆ నిలిచి ఉన్న వరద నీటిని తొలగించే డీవాటరింగ్ పంపుల పరికరాలు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎంతో మెరుగుపడిందని, మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు తెలిపారు. అయితే, దీంతోనే సంతృప్తి చెందకుండా మరింత మెరుగ్గా పని చేయాలని, కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి @KTRBRS పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 19, 2023
ఈరోజు నానక్ రామ్ గూడా లోని హెచ్‌జిసీఎల్… pic.twitter.com/yzzrCx9uhl