Kothaguda Fly Over: న్యూ ఇయర్ రోజు కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Kothaguda Fly Over: కొత్త సంవత్సరం నాడే మంత్రి కేటీఆర్ కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
Kothaguda Fly Over: ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ క్ సమస్యలు, సిగ్నల్ లేని ప్రయాణం సాగించేలా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఐటీ కారిడార్ కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్ పాస్ లను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ కొత్త కారిడార్ తో ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసే వీలు ఉంటుంది.
కొత్త ఫ్లైఓవర్ ప్రయోజనాలు
- గచ్చిబౌలి నుంచి ఆల్విన్ కాలనీ కూడలి వైపు వన్ వే ఫ్లైఓవర్ గా ఇది అందుబాటులోకి వచ్చింది.
- గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు, మసీద్ బండా, బొటానికల్ గార్డెన్ నుండి వచ్చే వాహనాలు ఈ కొత్త ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తాయి.
- ఈ ఫ్లైఓవర్ మీది నుంచి మాదాపూర్, హఫీజ్ పేట్ వైపు వెళ్లవచ్చు.
- ఈ నూతన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్ల వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
- ఈ ఫ్లైఓవర్ తో మాదాపూర్, కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు సాగించవచ్చు.
- ఈ కొత్త ఫ్లైఓవర్ తో కొండాపూర్ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ కూడళ్లలో ట్రాఫిక్ తగ్గనుంది.
- ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ ప్రయాణం సులభం కానుంది.
- మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారు ట్రాఫిక్ లో చిక్కుకోకుండానే ఇకపై రాకపోకలు సాగించే అవకాశం రానుంది.
- గచ్చిబౌలి జంక్షన్ నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆల్విన్ కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఈ ఫ్లైఓవర్ మీది నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించవచ్చు.
దూసుకుపోతున్న హైదరాబాద్
మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభత్వం వ్యూహాత్మంగా భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. అవన్నీ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వరుసగా ఓపెనింగ్‌కు వస్తున్నాయి. కొత్త ఏడాది తొలి రోజున షేక్ పేట ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్ పేట్ , ఫిలింనగర్ జంక్షన్ ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ ఇంటర్మిడియట్ రింగ్ రోడ్ నిర్మాణం నగరంలో రెండవ అతి పెద్దది.
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. నిర్మాణంలో భాగంగా 74 పిల్లర్స్, 72 పియర్ క్యాప్స్, 440 పి.ఎస్.సి గడ్డర్స్,144 కాంపోసిట్ గ్రీడర్స్ ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. మూడు రోజుల కిందటే మిథాని- ఒవైసీ ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో అత్యంత బిజీగా రూట్లలో ఒకటి ఎల్‌బినగర్ – చాంద్రాయణగుట్ట రూట్ . ఈ రూట్‌లోనే మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.