Harish Rao: సివిల్స్ ర్యాంకర్స్‌కు మంత్రి హరీశ్ అల్పాహార విందు, ట్రైనర్ బాలలతకు సత్కారం
Minister Harish Rao: హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రి హరీశ్ వారికి అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ (CSB IAS Academy) డైరెక్టర్, మెంటార్ అయిన మల్లవరపు బాలలతను సత్కరించారు.
Civils Toppers from Telangana AP: మే 30న విడుదలైన సివిల్స్ ఫైనల్ పరీక్షా ఫలితాలలో (Civils Results 2022) ర్యాంకులు సాధించిన విజేతలు కొందరికి తెలంగాణ రాష్ట్రమంత్రి టి.హరీష్ రావు (Minister Harish Rao) బుధవారం (జూన్ 1) ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. హైదరాబాద్ లోని తమ నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ (CSB IAS Academy) డైరెక్టర్, మెంటార్ అయిన మల్లవరపు బాలలత (Mallavarapu Bala Latha Madam) నేతృత్వంలో ర్యాంకులు సాధించిన వారు మంత్రి హరీష్ రావును (Minister Harish Rao) కలిశారు. ఆ ర్యాంకర్లను మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ఘనంగా సత్కరించారు. సివిల్స్ పరీక్షలలో ర్యాంకులు సాధించడం ద్వారా వీరు తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు.
స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత మేడం (Bala Latha) హైదరాబాద్ లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడమీని (CSB IAS Academy) ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 100 మందికి పైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమని అభినందించారు. సీఎస్‌బీ అకాడమీ (CSB IAS Academy) నుండి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని హరీష్ రావు (Minister Harish Rao) ఆకాంక్షించారు. సివిల్స్ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి బాలలత మేడం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎస్‌బీ అకాడమీ (CSB IAS Academy) ద్వారా మరింత మంది సివిల్స్ విజేతలను (Civils Results 2022) దేశానికి అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలుగు వారు పెద్ద సంఖ్యలో సివిల్స్ విజేతలుగా నిలిచారని అన్నారు.
Also Read: Karimnagar: ఈ ఊర్లో సాయంత్రం ఉండదు, మధ్యాహ్నం తర్వాత డైరెక్ట్‌గా రాత్రే! కరీంనగర్ జిల్లాలోనే
మంత్రిని కలిసిన ర్యాంకర్లు వీరే
గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి - 69వ ర్యాంకు
అరుగుల స్నేహ - 136వ ర్యాంకు
బొక్క చైతన్య రెడ్డి - 161వ ర్యాంకు
రంజిత్ కుమార్ పరవతి - 574వ ర్యాంకు
స్మరణ్ రాజ్ - 676వ ర్యాంకు
సివిల్స్-2021 ఫలితాల్లో 566వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ధి అఖిల్‌కు అభినందనలు. పేదరికం, అపజయాలు లెక్క చేయకుండా నిరంతర కృషితో లక్ష్యాన్ని చేరుకోవడం హర్షణీయం. మీ విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తి దాయకం. pic.twitter.com/zTFkgWdUWs
— Harish Rao Thanneeru (@trsharish) May 31, 2022