News
News
X

Gangula Kamalakar: ప్రతి లాకర్ ఓపెన్ చేసుకొమ్మని చెప్పా, పూర్తిగా సహకరిస్తా - ఈడీ సోదాలపై మంత్రి కామెంట్స్

బుధవారం ఈడీ సోదాల గురించి తెలుసుకొని దుబాయ్ నుంచి రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి మంత్రి గంగుల కమలాకర్ చేరుకున్నారు.

FOLLOW US: 

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం (నవంబరు 9) సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దుబాయ్ లో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. దుబాయ్ నుంచి బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి గంగుల కమలాకర్ చేరుకున్నారు. తాను దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల తెలిపారు. బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. 

‘‘విచారణ సంపూర్ణంగా చేయండి. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత కేంద్ర సంస్థలదే. నేను దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్‌ చేశారు. ఫోన్‌ చేసి ఇంటి తాళాలు తీయమని అడిగారు. నేనే ఇంట్లోని ప్రతి లాకర్‌ ఓపెన్‌ చేసి చూసుకొమ్మని చెప్పా. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు బయటకు చెప్పాలి’’ అని మంత్రి కమలాకర్‌ డిమాండ్ చేశారు. 

‘‘ఈడీ సోదాల విషయం తెలుసుకొని ఈడీ అధికారులకు సహకరించేందుకే 16 గంటల్లోనే వచ్చేశాను. 32 సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. పూర్తి పారదర్శకంగా వ్యాపారం జరుగుతుంది చట్టానికి ఎవరు చుట్టాలు కారు చట్టబద్ధంగా సహకరిస్తాను’’ అని మంత్రి గంగుల మీడియాతో అన్నారు.

‘‘గతంలో కూడా చాలా మంది మా పైన ఫిర్యాదు చేశారు. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత వాళ్లదే. మేం ఓపెన్ గానే ఉన్నాం. మా గ్రానైట్ ఆఫీసులు, క్వారీలు అన్ని చెక్ చేశారు. బంధువుల ఇళ్లలో అందరి ఇళ్లలో తనిఖీలు చేశారు. నేను దుబాయ్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. వీడియో కాల్ ఆన్ చేసి మా ఇంట్లో ఏఏ లాకర్లు ఉన్నాయో అన్నీ ఓపెన్ చేయించాను. తాళాలు నా దగ్గరే ఉన్న వాటిని పగలగొట్టమని చెప్పింది కూడా నేనే. అధికారులు అంతా పత్రాలు పరిశీలించారు. దర్యాప్తు చేసుకునేందుకు పూర్తిగా సహకారం అందిస్తా. వారు ఏం అడిగినా అన్ని వివరాలు ఇచ్చేందుకు రెడీ. నేను దుబాయ్ వెళ్లి 17 గంటలే అయింది. ఈడీ అధికారులు సోదాల కోసం వచ్చారు కాబట్టి, నేను ఇక్కడ ఉండాల్సిన బాధ్యత ఉందని వెంటనే వచ్చేశాను.’’ అని గంగుల కమలాకర్ మాట్లాడారు.

News Reels

ఈడీ అధికారుల సోదాలు

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్‌ రావు అనే వ్యక్తి సీబీఐ, జాతీయ హరిత ట్రిబ్యునల్ , కేంద్ర పర్యావరణశాఖకు గతేడాది ఫిర్యాదు చేశారు. అదే విషయంపై 2019లో కూడా బండి సంజయ్‌ కేంద్ర మంత్రి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆ రెండు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌, కరీంనగర్‌లోని గ్రానైట్‌ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని పీఎస్​ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్‌గూడ ఉప్పరపల్లిలోని ఎస్​వీజీ గ్రానైట్స్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతులు చేపట్టారనే సమాచారంతో కంపెనీ అధినేత శ్రీధర్‌ రావుకి కరీంనగర్‌లోని మూడు గ్రానైట్ క్వారీలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Published at : 10 Nov 2022 10:06 AM (IST) Tags: Gangula kamalakar minister gangula Granite Companies ED Raids in karimnagar

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Hyderabad Crime News: తాగుబోతు మొగుడిపై అలిగిన భార్య- కోపంతో ఉరివేసుకున్న భర్త!

Hyderabad Crime News: తాగుబోతు మొగుడిపై అలిగిన భార్య-  కోపంతో ఉరివేసుకున్న భర్త!

MLA's Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ప్రశ్నలకు బోరుమన్న న్యాయవాది ప్రతాప్!

MLA's Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ప్రశ్నలకు బోరుమన్న న్యాయవాది ప్రతాప్!

TS News Developments Today: నేడు రాజ్యాంగ దినోత్సవం- తెలంగాణ ‌టుడే అజెండాలో ముఖ్యాంశాలు ఇవే!

TS News Developments Today: నేడు రాజ్యాంగ దినోత్సవం- తెలంగాణ ‌టుడే అజెండాలో ముఖ్యాంశాలు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?