Chiranjeevi: నా మనవి ఒక్కటే, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు - చిరంజీవి విజ్ఞప్తి
Heavy Rains: మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకండి. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని చిరంజీవి అన్నారు.
![Chiranjeevi: నా మనవి ఒక్కటే, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు - చిరంజీవి విజ్ఞప్తి Megastar Chiranjeevi responds over heavy rains in Telugu states asks people wont come out Chiranjeevi: నా మనవి ఒక్కటే, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు - చిరంజీవి విజ్ఞప్తి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/01/8fe801c2a9b3840ed2e14712a3528f491725169518881234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi on Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు భారీగా కురుస్తుండడంపై నటుడు చిరంజీవి స్పందించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉందని.. ఎన్నో గ్రామాలు, రోడ్లు నీటితో మునిగిపోయాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని.. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రజలకు, బాధితులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నానని అన్నారు. ఇప్పుడు కూడా అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను’’ అని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)