By: ABP Desam | Updated at : 06 Jul 2023 01:30 PM (IST)
Edited By: jyothi
మేడ్చల్ జిల్లాలో దారుణం - నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్, అతనే తీసుకెళ్లాడా? ( Image Source : ABP Reporter )
Medchal News: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇడబ్ల్యూయస్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని స్థానికంగా ఉన్న ఓ థియేటర్ లో పని చేసే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అయితే చాలా సేపటి వరకు పాప ఇంట్లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పాపను వెతుక్కుంటూ బయటకు వచ్చారు. ఎంత చూసినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పాప రోజూ ఆడుకునే పిల్లలు.. దగ్గరి రోడ్లలో మొత్తం వెతికారు. అయినప్పటికీ బాలిక దొరక్కపోయే సరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు. బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వెంటనే స్పెషల్ పార్టీ టీం పోలీసులు రంగంలోకి దిగారు. వీరితో పాటు మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డి కూడా వచ్చి బాలిక తల్లిదండ్రులను కలిశారు. పాపకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప మిస్సైన విషయం తెలుసుకున్న కాలనీ వాసులంతా వారి ఇంటి దగ్గర గుమిగూడారు.
రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక ప్రజలను కూడా విచారించారు. ఇలా బాలిక నివాసానికి దగ్గర్లోనే ఉన్న జగదాంబ థియేటర్ లో పని చేసే సురేష్ యే పాపను తీసుకెళ్లాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే సకింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పాపతో సహా నిందితుడు కనిపించగా పోలీసులు అరెస్ట్ ేశారు. ప్రస్తుతం బాలికి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు.
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
ఇండియాలో మొదటి ఎగ్జిట్ పోల్ సర్వే ఎప్పుడు చేశారు? ఫస్ట్ ఫైవ్ ఇవే
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
/body>