అన్వేషించండి

Revanth Reddy: I.N.D.I.A ద్వారానే దేశానికి మళ్లీ మంచి రోజులు వస్తాయి: రేవంత్ రెడ్డి

Revanth Reddy: గాంధీ భవన్ లో స్వాతంత్ర దినోత్సవఁ ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. I.N.D.I.A ద్వారానే దేశానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని అన్నారు. 

Revanth Reddy: హైదరాబాద్ గాంధీ భవన్ లో స్వాతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 140కోట్ల భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈరోజు ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలన్నారు. అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, అలాగే అంబేద్కర్ దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారని చెప్పుకొచ్చారు. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశానికి సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని చెప్పుకొచ్చారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అంటూ ప్రశంసించారు. 

పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థికంగా పురోగతి వైపు నడిపించారన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ అవలంభిస్తోందన్నారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని రేవంత్ రెడ్డి చెప్పారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ చేశారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని.. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారని గుర్తు చేసారు. కానీ వాస్తవానికి పెరిగింది గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రమేనని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. మణిపూర్ మండుతుంటే మోదీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి... కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐ ని పంపించారని ఫైర్ అయ్యారు. నియంతలకంటే నికృష్టాంగ మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

 I.N.D.I.A  ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నాడని తెలిపారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు,  డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కాంగ్రెస్ వల్లేనని చెప్పారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరని, బీఆరెస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై తాము అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని.. 10వేల ఎకరాలు దోచుకుందని అన్నారు. 

కాంగ్రెస్ వస్తుంది రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని.. "తిరగబడదాం, తరిమికొడదాం" నినాదంతో ప్రజల్లోకి వెళదామని ప్రజలకు సూచించారు. ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget